వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ ఉచ్చు వెనుక భారీ మంత్రాంగం, డబ్బుఇస్తున్నట్లు చూపించేందుకు టీవీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పకడ్బందీ వ్యూహంతో పట్టుకున్నారు. రేవంత్ ఉచ్చు వెనుక భారీ మంత్రాంగం, ఆధునిక పరిజ్ఞానం, అవినీతి నిరోధక అధికారుల పక్కా కసరత్తు చేశారు. రేవంత్ రెడ్డిని సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవటానికి ఏసీబీ అధికారులు భారీ కసరత్తు చేసింది.

సాధారణ లంచం కేసులో నిందితుడిని పట్టుకోవటానికి ఏసీబీ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది. గుమస్తాను పట్టుకోవాలన్నా బాధితుడి నుంచి రాతపూర్వక ఫిర్యాదు తీసుకొంటారు. వివరాలు వాస్తవమేనా అని ఆరా తీస్తారు. ఆ తర్వాతే రంగంలోకి దిగుతారు.

రేవంత్ విషయంలో ఏమాత్రం బెడిసికొట్టినా ప్రభుత్వం చిక్కుల్లో పడే ప్రమాదముంది. దీంతో పలు విభాగాల అధికారులు పంచుకుని అత్యంత రహస్యంగా ఆపరేషన్‌ రేవంత్‌ను పూర్తి చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఈనాడులో కథనం వచ్చింది.

టీవీ కూడా కనిపించేలా ఆదివారమే డబ్బు ఇస్తున్నట్లు నిరూపించేందుకుగాను వీరంతా కూర్చున్న గదిలో టీవీ ఏర్పాటు చేసి, దాన్ని ఆన్‌చేసి పెట్టారు. దాని పక్కనే రేవంత్ రెడ్డి కూర్చునేలా చేశారు. రహస్య కెమెరాలో రేవంత్ రెడ్డితోపాటు టీవీలో దృశ్యాలు కూడా ఉన్నాయి.

3 Arrested

సీక్రెట్ చిత్రీకరణలో పాల్గొన్న అధికారులలో ఒకరిద్దరికి మాత్రమే రేవంత్‌ కోసమే ఈ తతంగం అంతా అని తెలుసు అంటున్నారు. మిగిలిన వారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. రేవంత్ రెడ్డి శనివారం వస్తున్నారన్న సమాచారం అందగానే రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్‌, సెబాస్టియన్‌, ఉదయ సిన్హాల సెల్ ఫోన్ల పైన నిఘా పెట్టారు.

వారి కదలికలను గమనించారు. ముడుపుల చెల్లింపు వ్యవహారాన్ని నమోదు చేసేందుకు రెండు ఐఫోన్లు, మూడు సోనీ ఆడియో రికార్డర్లను వినియోగించినట్లు మధ్యవర్తులు తమ నివేదికలో పేర్కొన్నారు. రేవంత్ తదితరులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే క్రమంలో ఏసీబీ అధికారులు కొందరిని మధ్యవర్తులుగా తీసుకెళ్లారు.

అనంతరం రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తనను మత్తయ్య ద్వారా రేవంత్ రెడ్డి సంప్రదించాలని స్టీఫెన్ సన్ ఏసీబీకి చెప్పారు. దీంతో, మెరికల్లాంటి అధికారులు, పోలీసులతో ఈ ఆపరేషన్‌ నిర్వహించాలని నిర్ణయించి రంగంలోకి దిగారు.

స్టీఫెన్ సన్‌ ఇల్లు కాకుండా లాలాపేటలోని అతడి బంధువు ఇంటిని వేదికగా చేసుకున్నారు. ఆ ఇంట్లో పరిస్థితులను పరిశీలించారు. ఆరుచోట్ల అత్యంత శక్తివంతమైన కెమెరాలను అమర్చి పలుసార్లు రిహార్సల్స్‌ కూడా చేశారని చెబుతున్నారు.

English summary
Heavy exercise: Telangana TDP Legislator Revanth Reddy Trapped While Allegedly Offering Bribe, 3 Arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X