గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో: భారీ వర్షానికి కారిపోయిన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం! వీఐపీ లాంజ్ లో వర్షపునీళ్లు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణాజిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మరో 36 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం రెండున్నర గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. విమానాశ్రయం వీఐపీ లాంజ్, టెర్మినల్, సిబ్బంది కార్యాలయాలు.. వంటి పలు ప్రదేశాల్లో చూరు కారుతూ కనిపించింది. అడుగులోతు వర్షపు నీళ్ల నిలిచిపోయాయి.

విమానాశ్రయ సిబ్బంది వాటిని బకెట్లతో ఎత్తి పోయాల్సి వచ్చింది. ఈదురు గాలులకు కార్యాలయ పైభాగం దెబ్బతినడంతో వర్షపు నీరు కారినట్లు సిబ్బంది తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదనరావు టెర్మినల్ కు చేరుకున్నారు. నీరు చేరిన గదులను పరిశీలించారు. ప్రయాణికులు సేదతీరడానికి ఏర్పాటు చేసిన లాంజ్ మొత్తం వాననీటితో తడిచి ముద్దయింది. సోఫా సెట్లపై కూర్చోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది.

మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అనంతపురం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. అనంతపురం సహా ఆత్మకూరు, కనగానపల్లి, అమడగూరు, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాల్లో సుమారు 54 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy rain lashes Gannavaram International Airport, rain water flooded in airport

ఫలితంగా చెక్‌ డ్యామ్‌లు, కుంటలు నిండాయి. కృష్ణా, పశ్చిమ గోదావరిలతో పాటు విశాఖపట్నంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కాగా- తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అండమాన్‌ సముద్ర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు పడే అవకాశం వుందని అధికారులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

English summary
Heavy rain lashes Gannavaram International Airport near Vijayawada in Andhra Pradesh. The India Meteorological Department (IMD) on Wednesday said that isolated places over East Rajasthan, East Uttar Pradesh, West Madhya Pradesh, Chhattisgarh are likely to receive heavy rainfall in next 24-hours. In its All India Weather Warning bulletin, the weather forecasting agency also added that regions such as Odisha, Marathawada, Coastal and South Interior Karnataka, Coastal Andhra Pradesh and Yanam, Tamil Nadu, Puducherry, Karaikal, Kerala and Mahe are also likely to witness heavy downpour today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X