• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక

|

డా.యం.ఎన్.చార్య, 9440611151

తెలుగు ఉభయ రాష్ట్రాలలో మేఘాడంబరంతో కూడిన వాతావరణం ఈ వారం ఉంటుంది. వాతావరణం చల్లబడుతుంది. రవి,చంద్ర,శుక్ర మరియు బుధులపై శని దృష్టి కారణంగా బంగాళాఖాతంలో ఉపరితలావర్తనం ఏర్పడుట వలన కోస్తాంధ్ర ,తమిళనాడు తీర ప్రాంతంలో విపరీతంగా గాలులు ,ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాల సూచనలు ఉన్నాయి.

అల్ప పీడన ద్రోనితో

అల్ప పీడన ద్రోనితో

తేది 26 , 27 తేదిలలో కుజుడు కన్యరాశి ప్రవేశ కారణం చేత శని ,కుజుల పరస్పర దృష్టి కారణం చేత బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోని లేదా వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తత్ ఫలితంగా తూర్పు ,ఆగ్నేయ మరియు ఈశాన్య దిశల వైపు అగ్ని ప్రమాదాలు మరియు భూకంపాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి

భారీ వర్ష సూచన

భారీ వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరంలో ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి పశ్చిమ దిశ నుండి బలమైన గాలులు వీస్తాయి,సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండటం శ్రేయష్కరం.

రానున్న 72 గంటల్లో

రానున్న 72 గంటల్లో

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్టల్రపై వరకూ విస్తరించి ఉంది. ఫలితంగా రాగల 72 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ప్రజలు ఎవరూ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.

రోగాల బారిన పడకుండా ఇలా చేయండి

రోగాల బారిన పడకుండా ఇలా చేయండి

ఇలాంటి సమయాలలో ప్రజలు సాధ్యమైనంత వరకు బయట స్ట్రీట్ ఫుడ్ తినంకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యాలకు మంచిది. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు లేకుండా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కాచి వడపోసిన నీళ్ళను త్రాగేతే ఏ జబ్బులు దరిచేరవు. విద్యుత్తు స్తంబాల దగ్గరకు వెళ్ళకుండా జాగ్రత్తతో ఉండాలి. ఇంట్లో చెత్త చెదారం లేకుండా జాగ్రత్త పడాలి. సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో దూపం వేసుకుంటే క్రిమి, కీటాకాలు రావు పైగా చెడు నివారణ కుడా జరుగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy Rains and weather forecast in Telugu States: Strong winds in Telugu states next 72 hours. Fishermen in these areas have also been advised not to venture into the seas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more