వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తణుకులో చేపల వాన: ఆశ్చర్యం, ఎగబడి ఏరుకున్న స్థానికులు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో వర్షంతో పాటు అక్కడక్కడా చేపల వాన కూడా కురుస్తున్న వార్తలను మనం చదివాం. తాజాగా ఈ చేపల వాన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కురిసింది.

<strong>కృష్ణా జిల్లాలో చేపల వర్షం: ఎగబడి ఏరుకున్న జనం</strong>కృష్ణా జిల్లాలో చేపల వర్షం: ఎగబడి ఏరుకున్న జనం

ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని తణుకు జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా పడ్డాయి. వర్షంతో పాటు చేపలు పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే వర్షంతో పాటు పడిన చేపలను పట్టుకునేందుకు పెద్దఎత్తున స్థానికులు ఎగబడ్డారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇలాంటి చేపల వర్షాన్ని తామెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ గోదావరిలో కురిసిన భారీ వర్షానికి గాను నిడదవోలు మండలం పెండ్యాలలో పిడుగుపడి ఎనిమిది మందికి గాయపడ్డారు. గాయపడ్డ వారని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గతంలో కూడా ఇదే విధంగా భారీ వర్షం కురిసినప్పుడు ఏపీలోని శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో చేపల వర్షం కురిసింది. వర్షంతో పాటు నీటితో పాటు త‌మ‌ పొలాల్లో చేప‌లు కూడా వ‌చ్చి ప‌డ‌డంతో శ్రీ‌కాకుళం పాతపట్నంలోని శిబ్బిలి గ్రామ ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గురయ్యారు.

<strong>శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం, కుప్పలు తెప్పలుగా పడ్డ వైనం</strong>శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం, కుప్పలు తెప్పలుగా పడ్డ వైనం

పాతపట్నం శివారు ప్రాంతాల్లోని పొలాల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చేపలను చూసిన రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వాటిని ఇంటికి తీసుకెళ్లారు. భారీ వర్షాల కారణంగానే ఆకాశం నుంచి చేపలు పడి ఉంటాయని భావిస్తున్నారు.

చేపల వర్షం వెనుక

చేపల వర్షం వెనుక

ఈ చేపల వాన వెనకు పెద్ద సైన్సు ఉందని సమాచారం. ఆకాశం నుంచి కింద పడే చేపలు నిజంగా ఆకాశం నుంచి రాలి పడవంట. ఇవి చుట్టుపక్కల ఉన్న సముద్రాల నుంచి వస్తాయంట.

 చేపల వర్షం వెనుక

చేపల వర్షం వెనుక

ఈ విషయంపై వాతావరణ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం వాతావరణంలోని మార్పుల వల్ల టోర్నడోలు ఏర్పడతాయి.

చేపల వర్షం వెనుక

చేపల వర్షం వెనుక

ఈ టోర్నడోలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి నీటిపై ప్రయాణించే సమయంలో ఆ నీటిని అపరమితమైన శక్తితో పైకి లాగుతాయి. చేపలు, కప్పలు వంటి సముద్ర జంతువులు కూడా టోర్నడోలతో పాటుగా ప్రయాణిస్తాయి.

చేపల వర్షం వెనుక

చేపల వర్షం వెనుక

కొంచెం సేపు ప్రయాణించిన తర్వాత ఈ టోర్నడోలు శక్తి హీనమవుతాయి. అలాంటప్పుడు సముద్రంలోని చేపలు వానలా కురుస్తాయి. సాధారణంగా ఈ టోర్నడోలు కొన్ని వందల కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంటాయి.

English summary
Heavy rains in West Godavari,fish rain in Tanuku.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X