కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వయంగా వస్తానన్న బాబు: 12ఏళ్ల తర్వాత కుప్పంలో అంత భారీ వర్షం..

తన సొంత నియోజకవర్గం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: దాదాపు 12ఏళ్ల తర్వాత చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ వర్షాలు కురిశాయి. తన సొంత నియోజకవర్గం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

భారీ వర్షాల పట్ల సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మత్తు చర్యలు తీసుకోవాలన్నారు. నీరు వృధా కాకుండా అన్ని రకాల చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

heavy rains in kuppam after 12years

వీలైతే ఈ నెల 14, 15 తేదీల్లో కుప్పం పర్యటనకు స్వయంగా వస్తానని చెప్పారు. కాగా, ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కుప్పం వీధులన్ని జలమయం అయ్యాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కుండపోత వర్షానికి చిత్తూరు జిల్లాలోని చెరువులన్ని నిండిపోయాయి.
English summary
Heavy rains poured down on Chittor from sunday evening to monday morning. CM Chandrababu enquired the details from officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X