• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుమల్లో తోపులాట భక్తులకు గాయాలు(ఫోటోలు)

By Nageswara Rao
|

తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సాధారణ భక్తుల్లో చాలా మంది ఇంకా క్యూ లైన్లలోనే ఉన్నారు. కిక్కిరిసిన భక్తజనంతో తిరుమల వరుసగా రెండోరోజూ కిటకిటలాడింది.

తోపులాటలు, తొక్కిసలాటలు, వాగ్వాదాలతో హోరెత్తిపోయింది. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. బాధితులను స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఒక దశలో అంబులెన్సు వెళ్లడానికి కూడా భక్తులు దారి ఇవ్వకపోవడం గమనార్హం.

గురువారం నుంచి క్యూ లైన్లలోనే ఉన్న భక్తులకు శుక్రవారం దాకా శ్రీవారి దర్శన భాగ్యం లభించలేదు. నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో రెండు రోజుల క్రితం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులను కాదని, వీఐపీ భక్తులకు దర్శనాన్ని కల్పించడంపై భక్తులు టీటీడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.

పోలీసులు భక్తజన సందోహాన్ని రోడ్డుపై వరుసక్రమంలో కూర్చోపెట్టి క్యూలోకి అనుమతించడంతో పరిస్థితి కొంత సర్దుమణిగింది. కాగా.. క్యూలైన్లలో బారులు తీరి గంటలకొద్దీ వేచి ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అల్పాహారాలను అందిస్తోంది, అన్నదానం చేసింది.

అయితే, క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరిగిపోయి క్యూలైన్ల వెలుపల వేలాదిగా భక్తజనం చేరడంతో లోపల ఉన్నవారికి అన్నపానీయాలు అందించలేక చేతులెత్తేసింది. దీనికితోడు.. రూ.300 టికెట్‌ క్యూలైన్‌లోకి యాత్రికులను అనుమతించకూడదని టీటీడీ తొలుత నిర్ణయించుకుంది.

 తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సాధారణ భక్తుల్లో చాలా మంది ఇంకా క్యూ లైన్లలోనే ఉన్నారు. కిక్కిరిసిన భక్తజనంతో తిరుమల వరుసగా రెండోరోజూ కిటకిటలాడింది.

 తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

గురువారం నుంచి క్యూ లైన్లలోనే ఉన్న భక్తులకు శుక్రవారం దాకా శ్రీవారి దర్శన భాగ్యం లభించలేదు. నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో రెండు రోజుల క్రితం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

 తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

పోలీసులు భక్తజన సందోహాన్ని రోడ్డుపై వరుసక్రమంలో కూర్చోపెట్టి క్యూలోకి అనుమతించడంతో పరిస్థితి కొంత సర్దుమణిగింది. కాగా.. క్యూలైన్లలో బారులు తీరి గంటలకొద్దీ వేచి ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అల్పాహారాలను అందిస్తోంది, అన్నదానం చేసింది.

తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

అయితే, క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరిగిపోయి క్యూలైన్ల వెలుపల వేలాదిగా భక్తజనం చేరడంతో లోపల ఉన్నవారికి అన్నపానీయాలు అందించలేక చేతులెత్తేసింది. దీనికితోడు.. రూ.300 టికెట్‌ క్యూలైన్‌లోకి యాత్రికులను అనుమతించకూడదని టీటీడీ తొలుత నిర్ణయించుకుంది.

 తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

తిరుమల్లో రద్దీ భక్తులకు గాయాలు

అందుకే అక్కడ ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. కానీ.. పోలీసులు ఈ లైన్‌లోకి భక్తులను అనుమతించడంతో సమస్యలు మొదలయ్యాయి. లోపల తమకు తిండి, నీరు లేక, మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేక నిర్బంధంలో ఉండాల్సి రావడంతో కొందరు గేట్లు ధ్వంసం చేసుకుని బయటకు వచ్చారు.

ఈ ఏడాది టీటీడీ అధికారులు ఈసారి సామాన్యభక్తులకే పెద్ద పీట వేసింది వీఐపీ పాసులను పరిమితంగా జారీచేసింది. హారతులు, ఆశీర్వాదాల్లేకుండా వారికి లఘుదర్శనంతో సరిపెట్టింది. సరిగ్గా గంటన్నరలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ముగించి సర్వదర్శనం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

English summary
Heavy rush of pilgrims determined to have Darshan of Lord Balaji in Tirumala on the occasion of Vaikunta Ekadasi and Dwadasi continued on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X