అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ‌ణికిన అమ‌రావ‌తి: స‌చివాల‌యంలో ఎగిరిన రేకులు : వ‌డ‌గళ్ల వాన‌తో అత‌లాకుత‌లం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో స‌డ‌న్‌గా వ‌చ్చిన ఈదురు గాలులు..భారీ వ‌ర్షంతో వ‌ణికింది. ముఖ్యంగా ఏపీ స‌చివాల‌యంలో గాలులు బీభ‌త్సం సృష్టించాయి. రేకులు ఎగిరిప‌డ్డాయి. నూత‌న హైకోర్టు రేకులు ఊడిపోయాయి. ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన స్థానికుల‌ను అతలాకుత‌లం చేసాయి.

సచివాల‌యంలో వ‌ర్ష బీభ‌త్సం..
ఏపీ రాజ‌ధాని అమ‌రాతి ప్రాంతంలో మంగ‌ళ‌వారం ఒక్క సారిగా వాతావ‌ర‌ణం మారి పోయింది. ఉద‌యం నుండి తీవ్రంగా ఉన్న ఎండ మ‌ధ్నాహ్నానికి పూర్తిగా మేఘావృతంగా మారింది. స‌డ‌న్‌గా ప్రారంభ‌మైన ఈదురు గాలులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ గాలికి తోడు భారీ వ‌ర్షం కుర‌వ‌టంతో భీభ‌త్సం ఏర్ప‌డింది. గాలల ధాటికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి. సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్‌పోల్‌, ఎంట్రీపాయింట్‌ కుప్పకూలాయి. బ్లాక్‌ టెర్రస్‌లో రేకులు ఎగిరిపడగా, నాలుగో బ్లాక్‌లో రేకులు ఈదురుగాలల ధాటికి విరిగిపోయాయి. అలాగే గుంటూరు, తాడికొండ ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Heavy wind and Rain damaged secretariat and Hi court in Amaravati

హైకోర్టు పైనా ప్ర‌భావం..
రాజ‌ధాని ప‌రిధిలోని వెల‌గ‌పూడిలో నూత‌నంగా నిర్మించిన హైకోర్టు భ‌వ‌నం మీద గాలి-వ‌ర్ష ప్ర‌భావం ప‌డింది. తాత్కాలిక హైకోర్టు భవనం కూడా దెబ్బతిన్నది. ఈదురు గాలులకు హైకోర్టు రేకులు ఊడిపోయాయి. అదే సమయంలో సమీపంలో ఉన్న రమణ అనే కార్మికురాలపై రేకులు పడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రేకులు లేచిపోవడంతో అక్కడి సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన భవనాన్ని రిపేర్‌ చేశారు. మంగళగిరిలో వడగాళ్ల వాన స్థానికులను అతలాకుతలం చేసింది. ఇక‌, రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని స్థానిక ప్ర‌జ‌ల‌ను ఆర్టీజీఎస్ నుండి స‌మాచారాల ద్వారా హెచ్చ‌రించారు.

English summary
Heavy wind and Rain caused damage to the AP secretariat and Hi court in Amaravati. Many hoardings near secretariat fell down due to heavy wind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X