విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ: హెల్మెట్ లేకపోతే పెట్రోల్ బంద్

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను తీసుకొంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకొంటుంది.

విజయవాడలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి నియమాన్ని అమలు చేయనున్నారు.ఈ నెల 26న, ద్విచక్రవాహనదారులు కఠినంగా అమలుచేయనున్నారు.

Helmets compulsory in Vijayawada from sep 26

ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా అమలు చేసే నిమిత్తం ఏపీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టనున్నారు. హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో పెట్రోల్ విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

మరో రెండు రోజుల్లో హెల్మెట్ నిబంధనలు అమలు చేస్తామని, హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని చెప్పారు.భవిష్యత్ లో తనిఖీలు మరింత పెంచుతామని హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గౌతం సవాంగ్.

తల్లిదండ్రులు తమ పిల్లలకు అధిక సామర్థ్యం గల ద్విచక్రవాహనాలను ఇవ్వొద్దని, పిల్లలు హెల్మెట్లు ధరించేలా చూసే బాధ్యత వారి తల్లిదండ్రులదేనని ఈ సందర్భంగా గౌతం సవాంగ్ సూచించారు.

English summary
Vijayawada city police and transport department are gearing up for the implementation of compulsory helmet rule from sep 26, 2017, as per the directions of the state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X