వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హేమమాలిని మిస్సింగ్': ఏంచేస్తారో, స్మృతిఇరానీ బెట్టర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Hema ‘Missing’, say irked Mathura locals
లక్నో: బీజేపీ మధుర పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి హేమమాలిని పైన ఆ నియోజకవర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హేమమాలిని అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తూ.. మధురలో పలువురు ఆమె మిస్సయ్యారంటూ పోస్టర్లు వేశారు. అంతేకాదు ఎన్‌హెచ్ 2 పైన ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో మధుర లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలి ప్రత్యర్థి జయంత్ చౌధరిపై ఘనవిజయం సాధించారు. అయితే, గెలిచిన తర్వాత కేవలం ఒక్కరోజు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారట. దీంతో, అక్కడి ప్రజలు హేమమాలినిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో హేమమాలిని మిస్సింగ్ అంటూ పోస్టర్లు అతికించడంతో పాటు ఆమె దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అంతటివాడే గెలిచిన మరునాటి నుంచే రంగంలోకి దిగితే... కొత్తగా గెలిచిన హేమమాలిని మాత్రం ఇంకా బాధ్యతలు తీసుకోలేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

బాలీవుడ్ నటిని ఎన్నుకోవద్దని తమను ప్రతి ఒక్కరూ హెచ్చరించారని అయితే, మధుర ప్రజలు ఆమెపై విశ్వాసం ప్రకటించారని, ఆమె కంటే స్మృతి ఇరానీ ఎంతో మేలని మరికొందరు అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి నిర్వహిస్తూ కూడా ఇరానీ తన నియోజకవర్గం అమేథీలో నెలకోసారైనా పర్యటిస్తున్నారన్నారు. మధురకు హేమమాలిని ఎప్పుడు వస్తారో, మధురకు ఆమె ఏం చేస్తారో కూడా తెలియడం లేదంటున్నారు.

English summary

 Angry over being 'ignored' by their newly elected BJP MP, a group of Mathura residents put up 'missing' posters of Hema Malini and also burnt her effigy on NH-2, protesting her absence from the constituency after her victory in the Lok Sabha polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X