వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది మా హక్కు, మద్దతుగా ఉంటా: నటి హేమ, 'చంద్రబాబు కావాలనే'

రిజర్వేషన్లు కాపు సామాజిక వర్గం హక్కు అని సినీ నటి హేమ అన్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: రిజర్వేషన్లు కాపు సామాజిక వర్గం హక్కు అని సినీ నటి హేమ అన్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

రిజర్వేషన్లు కాపుల హక్కులు అని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీనే తాము నెరవేర్చమని అడుగుతున్నామని చెప్పారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలన్నారు. దానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

కాగా, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్‌ బిల్లు పెట్టాలని, లేకుంటే చలో అమరావతి నిర్వహిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.

Hema says Reservations are Kapu rights

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం ఆయన కాపు ఐకాస సమావేశాన్ని నిర్వహించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు.

కాపు రిజర్వేషన్లు ఇవ్వలేదని నిరుత్సాహం చెందడం లేదని, ఇచ్చే వరకూ నిద్రపోకుండా పోరాడతామన్నారు. వైసిపి నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ... ముద్రగడ చేపట్టే ఏ ఉద్యమానికైనా తమ మద్దతు ఉంటుందన్నారు.

English summary
Actress Hema said that Reservations are Kapu community rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X