వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పని కాస్త ఆపుతారా? మాట్లాడుతున్నా కదా..!: ఐఈఏ సదస్సు నిర్వాహకులపై రాష్ట్రపతి అసహనం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్(ఐఈఏ) సదస్సులో నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా తీవ్ర గందరగోళం ఏర్పడడంతో ఆ సమయంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Recommended Video

ఎపిలో రాష్ట్రపతి : వరుస ప్రారంభోత్సవాలు, విందులు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ముగియకమునుపే, వచ్చిన వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం గందరగోళానికి దారితీసింది.

Here I am speaking.. Can you please stop that food packets distribution? - President Ram Nath Kovind

ఆహార పొట్లాల కోసం విద్యార్థులతో పాటు సదస్సుకు వచ్చిన వారు పరుగులు పెట్టడంతో సభ రసాభాసగా మారింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరగడంతో.. ఆయన చురకలంటించారు.

తన ప్రసంగానికి ఆటంకం కలిగించిన నిర్వాహకుల తీరును ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. 'ఆ పని కాస్త ఆపుతారా? మాట్లడుతున్నా కదా..!' అంటూ వేదికపై నుంచే ఆయన కోరడం గమనార్హం. ఆహారాన్ని అందించడం తప్పు కాదని, అయితే, అది సభకు ఆటంకం కలిగించేలా ఉండ కూడదని రాష్ట్రపతి హితవు పలికారు.

English summary
President Ram Nath Kovind feel angry about the distribution of food packets to the people while his speach is continuing in IEA meeting. While speaking as the chief guest for 100th meeting of Indian Economics association (IEA) which is held in Acharya Nagarjuna University president Ramnath Kovind expressed this negative feeling about the attitude of the meeting organizers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X