వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీతో జగన్ గంటన్నరపాటు భేటీ.. చర్చకు వచ్చిన 10 కీలక పాయింట్స్ ఇవే..

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇద్దరు దాదాపు గంటన్నరకు పైగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్ నివేదించారు. ఈమేరకు ఓ లేఖను కూడా ప్రధానికి అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీలు వంటి అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రత్యేక హోదాపై..

ప్రత్యేక హోదాపై..

అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది అని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించారు. దీన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు.

ఉగాది రోజు 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు

ఉగాది రోజు 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు

ఈ యేడాది మార్చి 25న ఉగాది రోజు 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నామని జగన్ మోదీకి తెలిపారు. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన పేదలందరికీ ఇళ్లు హామీ మేరకు.. ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ ఏడాది మార్చి 25న 25లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు.

2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి

2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి

2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానికి ఇచ్చిన లేఖలో సీఎం తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ,పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని, ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపారు. కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55549 కోట్లుగా అంచనా వేసిన విషయాన్ని వివరించారు.
దీనికి పరిపాలనా పరమైన అనుమతులు ఇంకా రాలేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూలోటు

రెవెన్యూలోటు


ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని,
ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలని ప్రధానిని సీఎం కోరారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధానికి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. అలాగే కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు.

వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు

వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు

హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జగన్ మోదీని కోరారు. ఈమేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గడిచిన ఆరేళ్లలో 7 వెనుకబడిన జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని గుర్తుచేశారు. రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరారు. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.

వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి

వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ
చేపట్టామని ప్రధానికి తెలిపారు.ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం-2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని చెప్పారు.

శాసనమండలి రద్దు

శాసనమండలి రద్దు

శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్న సీఎం.. గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని మోదీతో చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, శాసనసభ మండలిని రద్దు చేస్తూ కేంద్రానికి సిఫారసు చేశామన్నారు. తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం 2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన విషయాన్ని ప్రధానికి వివరించారు.
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి.

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy met Prime Minister Modi on Wednesday evening.CM Jagan has met with the prime minister as agenda of achieving special status,funding for projects and bifurcation issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X