వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాల్లేవు, మార్కెట్ ధర కంటే తక్కువే: హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పౌరసరఫరాల శాఖకు నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవని హెరిటేజ్ ఫుడ్స్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపింది. నెయ్యి సరఫరాలో ఒలంటి అక్రమాలకు పాల్పడలేదని, ఈ-వేలం ద్వారా నిబంధనలు పాటించే నెయ్యిని సరఫరా చేశామని పేర్కొంది.

1,300 టన్నుల నెయ్యి కావాలని టెండర్లు పిలిచారని చెప్పారు. 70 టన్నులకు మాత్రమే తాము కోట్ చేశామని హెరిటేజ్ ఫుడ్స్ అధ్యక్షుడు సాంబశివ రావు తమ ప్రకటనలో తెలియజేశారు. మార్కెట్ ధర రూ.53 ఉన్నప్పటికీ టెండర్లలో రూ.49.53 మాత్రమే కోట్ చేశామన్నారు. నెయ్యి సరఫరాలో అక్రమాలు జరిగాయన్న కథనాలు అవాస్తవమని అన్నారు.

Heritage Foods clarifies on ghee irregularities

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ల దాడి

కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండలం, గాదెల అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం ఉదయం కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో పలువురు ఎర్రచందనం స్మగ్లర్లు, తమిళ కూలీలు పోలీసులకు ఎదురుపడ్డారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు.

దీంతో పోలీసుల వెంటనే తుపాకులు తీసు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులకు భయపడ్డ స్మగ్లర్లు తప్పించుకోవడానికి పరుగులు తీశారు. తప్పించుకుపోతున్న స్మగ్లర్లను పోలీసులు వెంబడించారు. ఈ రోజు నిర్వహించిన కూంబింగ్‌లో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నామని, వారి నుంచి 150 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Heritage Foods clarifies on ghee irregularities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X