• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పసిదాని ప్రాణం కాపాడిన మహేష్... పునర్జన్మనిచ్చిన మనసున్న శ్రీమంతుడు...

|

వెండి తెర పైనే కాదు... నిజ జీవితంలోనూ మహేష్ మనసున్న శ్రీమంతుడే.. గతంలో ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి తన ఉదారతను చాటుకున్న ఈ సూపర్ స్టార్... తాజాగా మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి మానవత్వం చాటుకున్నాడు. మహేష్ ఉదారతకు,ఔన్నత్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేత వర్ల రామయ్య సైతం మహేష్‌పై ప్రశంసలు కురిపించారు.

తూర్పుగోదావరి... ఆ పేద దంపతుల చిన్నారికి...

తూర్పుగోదావరి... ఆ పేద దంపతుల చిన్నారికి...

వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కుంచె ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు నెల రోజుల క్రితం ఓ పాప పుట్టింది. పుట్టిన కొద్దిరోజులు ఆ పాపాయి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ... ఆ తర్వాత అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆ తల్లిదండ్రులకు బిడ్డ పుట్టిందన్న సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. పాపను అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా... చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని చెప్పారు. ఖర్చు ఎక్కువగానే అవుతుందని... మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా హైదరాబాద్ వెళ్లాలని చెప్పారు.

ఎవరిని కలవాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియని సమయంలో...

ఎవరిని కలవాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియని సమయంలో...

ఖర్చు ఎక్కువగానే అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ దంపతులకు ఏం చేయాలో తోచలేదు. పేద కుటుంబ నేపథ్యం కావడంతో ఎక్కడికెళ్లాలో.. ఎవరిని సాయం కోరాలో తెలియక తమలో తామే సతమతమయ్యారు. ఇలాంటి తరుణంలో తెలిసిన ఓ మిత్రుడు మహేష్ బాబు ట్రస్టు పేదింటి చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్స అందిస్తుందని వారితో చెప్పాడు. దీంతో ఎలాగోలా ఆ దంపతులు మహేష్ బాబు ట్రస్ట్ అధికారులను సంప్రదించారు.

రంగంలోకి దిగిన మహేష్ టీమ్... పాపకు పునర్జన్మ అన్న తల్లిదండ్రులు

రంగంలోకి దిగిన మహేష్ టీమ్... పాపకు పునర్జన్మ అన్న తల్లిదండ్రులు

సానుకూలంగా స్పందించిన మహేష్ టీమ్ వెంటనే రంగంలోకి ఆపరేషన్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది. గత నెల 30న చిన్నారిని ఆంధ్ర ఆస్పత్రి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌‌లో చేర్పించారు. జూన్ 2న ఆ చిన్నారికి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత ఒకటి,రెండు రోజులు చిన్నారి ఆరోగ్యం ఆందోళన కలిగించినప్పటికీ... రెండు వారాల తర్వాత పాప సంపూర్ణంగా కోలుకుంది. దీంతో డిశ్చార్జి చేసి స్వగ్రామానికి పంపించారు. ప్రస్తుతం తమ పాప ఆరోగ్యంగా ఉందని ప్రదీప్ జ్యోతి దంపతులు తెలిపారు.తమ పాపకు పునర్జన్మనిచ్చిన మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.

  Sushant Singh Rajput, Ankita Lokhande Best Moments Viral in Internet
  వర్ల రామయ్య ప్రశంసలు...

  వర్ల రామయ్య ప్రశంసలు...

  చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి తన ఉదారతను చాటుకున్న మహేష్ బాబుపై టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశంసలు కురిపించారు. గుండె ఆపరేషన్ చేయించి పేదింటి బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సాయం చిన్నదిగా కనిపించినా... ఆ కుటుంబానికి,బంధువులకు తీరని మనోవేదనను తప్పించిందన్నారు. మీకు,మీ కుటుంబానికి దేవుడు తోడుంటాడని మహేష్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. కాగా,మహేష్ ఇప్పటివరకూ వెయ్యి మందికి పైగా చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించడం గమనార్హం.

  English summary
  The helping hand of superstar Mahesh Babu has saved the life of another baby. The actor who is closely working with the Andhra Hospitals team has helped a poor couple. He has helped the couple in getting a life-saving surgery done for their one-month-old baby.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more