వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభిమాని బాధ చూసి కంటతడి పెట్టుకున్నరామ్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం : బాల్యం ఎవరికైనా మధురానుభూతే. పిల్లలు బుడిబుడి నడకలు వేస్తుంటే చూడాలని.. బుజ్జి బుజ్జి మాటలతో ముద్దులొలుకుతుంటే ముద్దు చేయాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. కానీ ఐదేళ్ల పసిప్రాయంలోనే ఓ చిన్నారికి నడుం చచ్చుబడిపోయింది.

దీంతో మధురంగా ఉండాల్సిన బాల్యం కాస్త.. గాయంలా ఆ చిన్నారిని వేధిస్తుంటే.. చిన్నారి బాధను చూడలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అయితే చిన్నారి అభిమాన హీరో రామ్ తనను పరామర్శించడంతో ఆ చిన్నారి కళ్లల్లో ఆనందం నిండింది.

వివరాల్లోకి వెళితే.. ఎంవీపీకాలనీ సెక్టార్ 3 నివాసితుల సంక్షేమ సంఘం (యువజన విభాగం) అధ్యక్షుడు రవికుమార్ రెండో కుమార్తె కుందన పూర్ణచంద్రిక (5) పుట్టుకతోనే నడుం చచ్చుబడడంతో తీవ్ర వేదనకు గురవుతోంది.

Hero Ram was meeted his child fan in vizag

కాగా, చిన్నారి చంద్రిక టాలీవుడ్ హీరో రామ్ కు ఫ్యాన్. గతంలో నగరానికి వచ్చిన రామ్ ను దగ్గరినుంచి చూసే అవకాశం కూడా చిన్నారికి దక్కింది. ఇక అప్పటినుంచి రామ్ ను మళ్లీ మళ్లీ చూడాలన్న కుతుహలం చిన్నారిలో పెరిగింది.

ఈ నేపథ్యంలోనే.. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖలో అడుగుపెట్టిన రామ్ చిన్నారి గురించి తెలుసుకుని పరామర్శించడానికి వెళ్లాడు. శుక్రవారం నాడు సాయంత్రం రామ్ చిన్నారిని కలవడంతో.. ఆ చిన్నారి కళ్లలో ఆనందం నిండింది.

Hero Ram was meeted his child fan in vizag

చిన్నారి తల్లిదండ్రులతో వారింట్లోనే కొద్దిసేపు ముచ్చటించిన రామ్.. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. కుందన ఆరోగ్య పరిస్థితికి చలించిపోయిన రామ్ కంటతడి పెట్టుకోవడం గమనార్హం. కొద్దిసేపటికి తేరుకున్న రామ్.. చిన్నారి కుటుంబ సభ్యులందరినీ శనివారం మధ్యాహ్నాం భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు.

English summary
Tollywood hero Ram meeted his child fan in vizag. The little fan was from illness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X