వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ‌రుడ శివాజీ నోరు విప్పారు: తెలంగాణ ప్ర‌భుత్వం ప‌గ ప‌ట్టింది: సిల్లీ కేసు.. నాలుగు రోజుల్లో వ‌స్తా..

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులుగా టీవీ9 వ్య‌వ‌హారంలో పోలీసులు ఎదురు చూస్తున్న హీరో శివాజీ ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. త‌న‌ది సివిల్ కేసు అంటూనే..చాలా సిల్లీ కేసుగా కొట్టి పారేసారు. అనారోగ్యం కార‌ణంగా బ‌య‌ట‌కు రావ‌టం లేద‌ని చెబుతూ.. త‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ప‌గ ప‌ట్టింద‌ని చెప్పుకొచ్చారు. వెయ్యి కేసులు పెట్టిన భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాద‌న్నారు శివాజీ..

శివాజీ వీడియో సందేశం..
టీవీ9 వ్య‌వ‌హారంలో ర‌వి ప్ర‌కాశ్‌తో పాటుగా పోలీసులు నోటీసులు జారీ చేసిన హీరో శివాజీ ఎట్టేకేల‌కు నోరు విప్పారు. ఆయ‌న ఒక వీడియో సందేశాన్ని విడుద‌ల చేసారు. త‌న‌కు వ‌డ‌దెబ్బ కార‌ణంగా విశ్రాంతి తీసుకుంటున్నాన‌ని వివ‌రించారు. తాను ప‌రారైన‌ట్లుగా..త‌న‌ను వెంటాడుతున్న‌ట్లుగా క‌ధ‌నాలు రావ‌టం బాధ‌కర‌మ‌న్నారు. రవి ప్ర‌కాశ్.. త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన షేర్ల బ‌దిలీ సివిల్ వ్య‌వ‌హార‌మ‌ని..అవ‌స‌రం లేపోయినా దాన్ని క్రిమిన‌ల్ కేసుగా చేసార‌ని శివాజీ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. తాను 2018లో షేర్లు కొనుగోలు చేసిన మాట వాస్త‌వమేన‌ని అంగీక‌రించారు. యాజ‌మ‌న్యం మారింది కాబ‌ట్టి షేర్ల గురించి తాను అడిగాన‌ని..ఇందులో త‌ప్పేంటని ప్ర‌శ్నించారు. త‌మ మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంలో జోక్యం చేసుకోవ‌టానికి కౌశిక్ రావు ఎవ‌ర‌ని నిల‌దీసారు. ఆయ‌న ఫిర్యాదుతోనే తెలంగాణ పోలీసులు త‌న ఇంటి మీద దాడి చేసి హంగామా సృష్టించార‌ని..సోదాలు చేసినా ఏమీ దొర‌క‌లేద‌ని త‌న భార్య‌తో సంత‌కం చేయించుకొని వెళ్లి పోయార‌ని వివ‌రించారు.

Hero Sivaji in video message clarified that he will attend police with in four days.

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌గ ప‌ట్టింది..
రెండేళ్ల‌కు పైగా తెలంగాణ ప్ర‌భుత్వం త‌న మీద ప‌గ ప‌ట్టింద‌ని శివాజీ చెప్పుకొచ్చారు. కొంత మంది ఆంధ్ర నేత‌లు సైతం ఉన్నార‌ని వివ‌రించారు. తాను హైద‌రాబాద్‌లో సెటిల‌ర్‌న‌ని..త‌న‌కు స్థానికంగా బ‌లం లేద‌ని వారు అనుకుంటున్నార‌ని పేర్కొన్నారు. త‌న పైన వంద కాదు..వేయి పెట్టుకున్న భ‌య‌మేని లేద‌న్నారు. ఇవ‌న్నీ సిల్లీ కేసులంటా తేలిగ్గా కొట్టిపారేశారు. త‌న పైన రాళ్లు విసిరితే అవి మీకే త‌గులుతాయ‌ని హెచ్చ‌రించారు. మై హోమ్ అధిఆనేత రామేశ్వ‌ర‌రావు త‌న‌కు బాగా తెలుస‌ని చెప్పిన శివాజీ..ఆయ‌న పిలిచి అడిగితే తాను అన్నీ చెప్పేవాడిన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా తాను ఎక్క‌డికీ పారిపోలేద‌ని..వ‌డ‌దెబ్బ త‌గిలి విశ్రాంతి తీసుకుటున్నాన‌ని చెప్పారు. కుట్ర‌లో భాగంగానే త‌న‌ను ఇరికించార‌ని..అన‌వ‌స‌రంగా త‌న పైన టీవీల్లో చ‌ర్చ‌లు పెట్ట‌వ‌ద‌న్నారు. నాలుగు రోజుల్లో బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని..అప్పుడు పోలీసుల దగ్గ‌ర‌కు వెళ్తాన‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
Hero Sivaji released video message. In this video Sivaji says he not ran away to police. He got sun stroke and in rest. Sivaji said that Telangana Govt with intention hunting him. In four days Sivaji assured to attend before police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X