విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో హెరాయిన్ ప్రకంపనలు-టీడీపీకి డీజీపీ కౌంటర్-సంబంధం లేదని మళ్లీ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ లోని గుజరాత్ ముంద్రా పోర్టులోకి వచ్చిన హెరాయిన్ డంప్ విషయంలో ఏపీలో రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ విజయవాడకు ఆఫ్ఘన్ నుంచి హెరాయిన్ వచ్చిందని ఆరోపిస్తూ వచ్చిన టీడీపీ తాజాగా సీఎం ఇంటి పక్కనే హెరాయిన్ అక్రమ రవాణా జరుగుతోందంటూ చేస్తున్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు కౌంటర్లు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు.

సీఎం జగన్ ఇంటి పక్కనే హెరాయిన్ అక్రమ రవాణా జరుగుతోందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై డీజీపీ గౌతం సవాంగ్ ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. హెరాయిన్ అక్రమ రవాణాకు ఏపీకి ఎలాంటి లింకులు లేవని ఆయన మరోసారి తేల్చిచెప్పారు. విజయవాడ అడ్రస్ మినహా హెరాయిన్ రవాణాతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చెన్నై కేంద్రంగానే ఈ కార్యకలాపాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. టీడీపీ నేతలు మాత్రం సీఎం జగన్ ఇంటివద్ద అక్రమ రవాణా జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారని సవాంగ్ ఆక్షేపించారు. టీడీపీ విమర్శల్ని ఆయన ఖండించారు.

heroin seizure tremours in ap, dgp gowtham sawang denied tdp allegations, co-operate investigation

హెరాయిన్ రవాణా విషయంలో ఏపీ పాత్ర ఉందని దుష్ర్పచారం జరుగుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. హెరాయిన్ వ్యవహారంపై డీఆర్ఐ, నార్కోటెక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. విజయవాడను ట్రాన్స్‌ఫోర్ట్ అడ్రస్‌గా మాత్రమే నిందితులు వాడుకున్నారని డీజీపీ గుర్తుచేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతాభావంలోకి నెడుతున్నారని గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ నేతలకు డీజీపీ హితవుపలికారు. అసాంఘిక కార్యకలాపాలకు రాష్ట్రంలో చోటు లేదని డీజీపీ తేల్చిచెప్పారు. హెరాయిన్ కేసులో దర్యాప్తు బృందాలకు తాము పూర్తి సహకారం అందిస్తామన్నారు.

మరోవైపు గుజరాత్ లోని ముంద్రా పోర్టు తరహాలోనే ఏపీలోని కృష్ణపట్నం పోర్టుకు హెరాయిన్ దిగుమతి జరిగినట్లు ఇవాళ ఆరోపణలు వచ్చాయి. దీంతో టీడీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇది కాస్తా వైసీపీ సర్కార్ కు ఇబ్బందికరంగా మారుతోంది. ఇఫ్పటికే విజయవాడ సీపీతో పాటు వైసీపీ మంత్రులు, నేతలు కూడా హెరాయిన్ వ్యవహారంలో తమపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఇప్పుడు స్వయంగా డీజీపీ కూడా రంగంలోకి దిగి ఖండించడంతో ఇఫ్పటికైనా టీడీపీ నేతల నుంచి విమర్శల దాడి ఆగుతుందో లేదో చూడాల్సి ఉంది.

English summary
andhrapradesh dgp gowtham sawang on today condemns opposition tdp's allegations on illegal heroin transport from afghanistan to vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X