గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హై టెన్షన్ : ఆత్మకూరుకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నం :అడ్డుకున్న పోలీసులు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

నిర్భందించినంత మాత్రాన,ఈ పోరాటం ఆగదన్న చంద్రబాబు || TDP Chief Chandrababu Warns Jagan Government

మాజీ ముఖ్యమంత్రి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎప్పుడు పోలీసులు వదిలితే అప్పుడు వెళ్లి తీరుతామని ప్రకటించారు. ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. ఎస్సీ..మైనార్టీల కుటుంబాలను వారి గ్రామాల్లో వదిలి వారికి భరోసా ఇచ్చేవారకు వెనక్కు తగ్గమని స్పష్టం చేసారు. ఉదయం నుండి పోలీసులు చంద్రబాబు తో పాటుగా లోకేశ్ ను హౌస్ అరెస్ట్ చేసారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లను నిరసిస్తూ చంద్రబాబు తన ఇంటి నుండి ఆత్మకూరు వెళ్లే ప్రయత్నం చేసారు. అయితే, ఇంటి గేటు నుండి బయటకు రాకుండా పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. చంద్రబాబు తన వాహనంలోనే కూర్చొని ఉన్నారు. కార్యకర్తలు చంద్రబాబుకు అనుకూలంగా ప్రభుత్వం..పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తనను నిర్బంధించి ఛలో ఆత్మకూరు ఆపలేరని చంద్రబాబు స్పష్టం చేసారు.

అఖిలప్రియ హౌస్ అరెస్ట్ : పోలీసులతో వాగ్వాదం: సోదరుడు రూమ్ లో తనిఖీలు..!!అఖిలప్రియ హౌస్ అరెస్ట్ : పోలీసులతో వాగ్వాదం: సోదరుడు రూమ్ లో తనిఖీలు..!!

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రాబును ఆత్మకూరుకు వెళ్లనీయకుండా పోలీసులు ఉదయం హౌస్ అరెస్ట చేసారు. చంద్రబాబు వద్దకు వచ్చే పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం బాధితులకు మద్దతు గా 12 గంటల దీక్షకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల హౌస్ అరెస్ట్ గురించి తెలుసుకున్న చంద్రబాబు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత తాను ఆత్మకూరు వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పోలీసులు పార్టీ నేతలను అడ్డుకున్నా ఛలో ఆత్మకూరు కార్యక్రమం రద్దు లేదా వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎస్సీ..మైనార్టీ కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. పోలీసులు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు వెళ్తామని..ఎన్ని రోజులు నిర్బంధం కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఛలో ఆత్మకూరు కార్యక్రమం పైన రాజీపడేది లేదని స్పష్టం చేసారు. అచ్చెన్నాయుడు ను పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పటం పైన ఫైర్ అయ్యారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ విమర్శించారు. పరిపాలించే వ్యక్తి క్యారెక్టర్ ఎలాంటిది ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. 545 కుటుంబాలను వారి గ్రామాల్లో నివసించే హక్కు కల్పించమని డిమాండ్ చేస్తున్నామని..బాధితులకు స్వగ్రామాలకు వెళ్లే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేసారు. ఆ తరువాత ఆయన ఆత్మకూరుకు వెళ్లే ప్రయత్నం చేసారు. అయితే ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున చంద్రబాబును బయటకు రాకుండా గేటు వద్దే అడ్డుకున్నారు.

వాహనంలో చంద్రబాబు..గేటు వద్ద పోలీసులు..
ఛలో ఆత్మకూరుకు బయల్దేరిన చంద్రబాబును ఇంటి గేటు దాటకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు చంద్రబాబుకు అనుకూలగా నినాదాలు చేసారు. పోలీసులు పెద్ద ఎత్తున గేటు వద్ద నిలువరించారు. బలగాలను పెద్ద ఎత్తున మొహరించారు. చంద్రబాబు వాహనం బటయకు రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లతో కట్టి..పోలీసులు అడ్డంగా నిలబడ్డారు. పార్టీ నేతలు.. కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు.

Hi tense created atEx CM Chandra babu House. Babu started for Atmakuru and police did not allow him

చంద్రబాబు తన వాహనంలోనే కూర్చొని ఉండగా..పోలీసులు గేటు వద్ద మొహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ..పోలీసులు ఎప్పుడు వదిలితే అప్పుడు ఆత్మకూరు వెళ్తామని..ఇది ఆగదని మరో సారి స్పష్టం చేసారు. అయితే, చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ పరిస్థితి తెలుసుకున్న కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో..పోలీసులు సైతం భారీగా మొహరించారు.

English summary
Hi tense created atEx CM Chandra babu House. Babu started for Atmakuru and police did not allow him to come out side. babu waiting in his vehicle to proceed. patly leaders and volunteers giving slogansa against govt and police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X