• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీతో పాటు ఏడు రాష్ట్రాల్లో హై అలెర్ట్ .. పుల్వామా తరహా ఉగ్రదాడులకు స్కెచ్

|
  ఆర్టికల్ 370 ఎఫెక్ట్ ... పుల్వామా తరహా దాడులకు పాక్ ప్లాన్ ! || Oneindia Telugu

  ఆర్టికల్ 370ని రద్దు పై పాకిస్తాన్ అట్టుడుకుతోంది. జమ్ముకశ్మీర్ కు ఏడు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాకిస్థాన్ తో పాటు ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులు అసహనంతో రగిలిపోతున్నారు. ఇక మరోవైపు భారత దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్ లో భారీ ఎత్తున ఉగ్రదాడులకు దిగాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి.

  ఏపీతోపాటు ఏడు రాష్ట్రాల్లో హై అలెర్ట్ .. ఉగద దాడులపై ఇంటిలిజెన్స్ హెచ్చరికలు

  ఏపీతోపాటు ఏడు రాష్ట్రాల్లో హై అలెర్ట్ .. ఉగద దాడులపై ఇంటిలిజెన్స్ హెచ్చరికలు

  ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయతో పాటు ఏడు రాష్ట్రాల్లో జైషే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ, పోలీస్, ఇతర భద్రతాదళాలపై పుల్వామా తరహా దాడులు చేసే దిశగా ఉగ్రవాదులను పాక్ కు చెందిన ఐఎస్ఐ ప్రేరేపిస్తోందని హెచ్చరిస్తున్నాయి .ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ తో పాటుగా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

  విమానాశ్రయాల్లో భద్రత పెంపు.. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో హై అలెర్ట్

  విమానాశ్రయాల్లో భద్రత పెంపు.. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో హై అలెర్ట్

  దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు . దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడొచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు విమానయాన శాఖ అధికారులు. ఆగష్టు 15తో పాటు, కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహంతో ఉన్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో ఈరోజు నుండి ఈ నెల 20వ తేదీ వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు . ఈ నెల 20వ తేదీ వరకు విమానాశ్రయంలోకి సందర్శకులను అనుమతించరు. అలాగే అన్ని రకాల పాసులను కూడా రద్దు చేశారు ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు. ఇక తనిఖీలు చేసిన తర్వాతే వాహనాలను ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు.

  సామాన్య ప్రజలే టార్గెట్ గా దాడులకు అవకాశం అని హెచ్చరిస్తున్న ఇంటిలిజెన్స్ వర్గాలు .. అప్రమత్తమైన రాష్ట్రాలు

  సామాన్య ప్రజలే టార్గెట్ గా దాడులకు అవకాశం అని హెచ్చరిస్తున్న ఇంటిలిజెన్స్ వర్గాలు .. అప్రమత్తమైన రాష్ట్రాలు

  దాడులకు తెగబడేందుకు ఉగ్రమూకలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు హెచ్చరించిన ఐబీ అధికారులు సామాన్య ప్రజలే టార్గెట్‌గా విరుచుకుపడేలా కుట్రలు జరుగుతున్నాయనిచెప్తున్నారు . ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో ఇంటెలిజెన్స్ హెచ్చరించిన ప్రధాన రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు

  . ఒకపక్క జమ్మూ కాశ్మీర్ పునర్విభజన , మరోపక్క త్వరలో రాబోతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు .. ఈ నేపధ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Pakistan-inspired terrorists along with Pakistan are embarrassed by the Indian government's repeal of Article 370, which has been giving seventy years of special credit to Jammu and Kashmir. And also It is time for India's Independence Day celebrations. Intelligence sources have reported that India has already made several key decisions in the case of Jammu and Kashmir so terrorists are planning to pulwama style attacks.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more