వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపులకే సిఎం: చిరుVsబొత్స, ముఖేష్ టిపిసిసి చీఫ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Command calls Killi and Mukesh
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాపు నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టాలని చూస్తోంది. రేసులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. అయితే చిరు వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలున్నాయి.

మరోవైపు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ముఖేష్ గౌడ్, కిల్లి కృపారాణిలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ముఖేష్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. మంత్రి ముఖేష్ గౌడ్‌కు తెలంగాణ పిసిసి అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి పిలుపు రావడంతో కిల్లి కృపారాణి రేపు ఉదయం ఆమెతో భేటీ కానున్నారు. బొత్స పిలుపుతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ఢిల్లీ చేరుకున్నారు.

కాగా, ముఖ్యమంత్రిగా విజయనగరం జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నియమితులవుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బొత్స కూడా ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కితే జిల్లా నేతకు ఆ హోదా దక్కటం ఇదే తొలిసారి అవుతుంది.

అధిష్ఠానం వద్ద బొత్సకు పలుకుబడి, అధికార పార్టీ ప్రముఖులతో పరిచయాలు, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సఖ్యత ఇవన్నీ తనకు కలిసొచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. ఎపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్, గతంలో ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన అజాద్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.

ఈ కారణంగా సిఎం పీఠంపై బొత్స గురి తప్పదన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. సిఎంగా బొత్స నియమితులైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. అంతేగాకుండా ఆయన సారథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలోనే నిర్వహించే అవకాశం ఉంటుంది.

English summary
Congress Party High Command called Mukesh Goud and Killi Kruparani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X