వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ రంగులపైన హైకోర్టు సీరియస్: ప్రభుత్వ భవనాలకు వేస్తారా: నివేదిక ఇవ్వాలని ఆదేశం..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్నింటికీ వైసీపీ రంగులు వేయటం పైన ఇప్పటి వరకు రాజకీయంగా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా హైకోర్టు సైతం ఇదే అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలను వైసీపీ రంగులు వేయటం పైన హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ వ్యవహారం పైన కీలక సూచనలు చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాల యానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం పైన కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయంగా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ..వార్డు సచివాలయాలకు వైసీపీ రంగులు వేసారు. ఆ తరువాత గ్రామాల్లోని అనేక కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం పైన ప్రతిపక్ష పార్టీలతో సహా.. చివరకు కొన్ని ప్రాంతాల్లో కరెంటు స్తంభాలకు.. గుడులకు సైతం ఇవే రంగులు వేసారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేసారు.

High cort seek report from AP govt on YCP colours to govt buildings

సమాధులకు సైతం పార్టీ రంగులు వేస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. ఇక, ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. దీని పైన ఇక కోర్టు సైతం సీరియస్ గా స్పందించింది. దీని మీద నివేదిక సైతం కోరింది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశం మీ ఏ రకంగా స్పందిస్తుందీ..కోర్టుకు ఎటువంటి నివేదిక ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. అదే సమయంలో ఇప్పటి వరకు వైసీపీ రంగులు వేసిన భవనాలకు రంగులు మారుస్తుందా..లేక కొనసాగిస్తుందా అనే చర్చ సైతం మొదలైంది.

English summary
AP High court serious on YCP colours for govt offices in state. Court ordered for total report to be submitted with in ten days time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X