• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోరంట్ల మాధవ్ నామినేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ : ఇక ఎన్నికల బరిలో మాజీ పోలీస్!

|

అనంతపురం: ఇన్నాళ్లూ ట్విస్టుల మీద ట్విస్టులతో తీవ్ర ఉత్కంఠతకు గురి చేసిన గోరంట్ల మాధవ్ నామినేషన్ ఉదంతం సుఖాంతమైంది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదివరకు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే మంజూరు చేయాలంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టి పడేసింది. దీనితో గోరంట్ల మాధవ్ నామినేషన్ ను ఎన్నికల కమిషన్ స్వీకరించడం ఇక లాంఛనప్రాయమే.

మాధవ్ ఉదంతంలో అనేక ట్విస్టులు..

మాధవ్ ఉదంతంలో అనేక ట్విస్టులు..

గోరంట్ల మాధవ్ మాజీ పోలీసు అధికారి. ఇదవరకు ఆయన అనంతపురం జిల్లా కదిరి ఎస్ఐగా పనిచేశారు. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా వ్యవహరించారు. రాజకీయాల్లో ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆయన తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన ఆయనను అనంతపురంలోని హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టారు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అక్కడిదాకా అంతా సవ్యంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాతే అసలు ఇబ్బందులు తలెత్తాయి.

డిసెంబర్ లో దాఖలు చేసినా..

డిసెంబర్ లో దాఖలు చేసినా..


స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలంటూ గోరంట్ల మాధవ్ గత ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. జనవరిలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనను హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన మాధవ్, నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఆయన వీఆర్ఎస్ ను ఆమెదించలేదు. వీఆర్ఎస్ తీసుకోకుండా నామినేషన్ వేయడం చట్టరీత్యా సాధ్యం కాదు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తన వీఆర్‌ఎస్‌ను ఆమోదించట్లేదని ఆరోపిస్తూ, మాధవ్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

ట్రైబ్యునల్ ఆదేశించినా.. హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వం

ట్రైబ్యునల్ ఆదేశించినా.. హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వం

మాధవ్ ఉదంతాన్ని క్షుణ్నంగా పరిశీలించిన ట్రైబ్యునల్‌ ఆయన వీఆర్‌ఎస్‌ను వెంటనే ఆమోదించేలా చర్యలు తీసుకుంది. వీఆర్ఎస్ ను ఆమోదించాలని కర్నూలు రేంజ్ డీఐజీని ఆదేశించింది. నామినేషన్‌కు అడ్డంకులు లేకుండా రిలీవ్‌ చేయాలంటూ కర్నూలు డీఐజీని సూచించింది. ట్రైబ్యునల్ ఆదేశించినప్పటికి వీఆర్ఎస్ ఆమోదం పొందినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దీనితో మాధవ్.. ట్రైబ్యునల్ ఉత్తర్వులను కర్నూలు రేంజ్ డీఐజీ ఉద్దేశపూరకంగా అమలు చేయడం లేదని అంటూ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించినా..

ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించినా..

గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా జోక్యం చేసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ ను వెంటనే ఆమోదించి ఉద్యోగ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలంటూ ఇదివరకే రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయినప్పటికీ, డీజీపీ కూడా దీన్ని పట్టించుకోలేదు. స్వయంగా ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కూడా పెడచెవిన పెట్టారు. మాధవ్ వీఆర్ఎస్ ను ఆమోదిస్తూ సంబంధిత పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాలేదు.

దీనితో మాధవ్ హైకోర్టును ఆశ్రయించారు. తన వీఆర్ఎస్ ఆమోదాన్ని వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి రాష్ట్ర పోలీసు శాఖ కౌంటర్ వేసింది. మాధవ్ పై రెండు చార్జి షీట్లు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ఆయనను రిలీవ్ చేయటం కుదరదని పోలీసు శాఖ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అక్కడితో ఆగలేదు. ఇదివరకు ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా న్యాయస్థానాన్ని కోరింది. ఇప్పట్లో రిలీవ్ అయ్యే అవకాశం లేకపోవటంతో గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో పోటీపై ఆశలు వదులుకున్నారు. తన భార్య సవిత పేరును తెరమీదికి తెచ్చారు. మాధవ్ నామినేషన్ వేయలేకపోతే, సవితకు టికెట్ ఇస్తామని వైఎస్ జగన్ కూడా ప్రకటించారు.

నామినేషన్ల చివరి రోజు.. అసలు ట్విస్ట్

నామినేషన్ల చివరి రోజు.. అసలు ట్విస్ట్

ప్రభుత్వం వేసిన పిటీషన్, గోరంట్ల మాధవ్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం తన తీర్పును వెలువడించింది. వీఆర్ఎస్ తీసుకోవడానికి అవసరమైన అన్ని అర్హతలు గోరంట్ల మాధవ్ కు ఉన్నాయని స్పష్టం చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ముత్తుస్వామి కేసు తీర్పును ఉటంకించింది. గోరంట్ల మాధవ్ ను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించడంతో పాటు ఆయన నామినేషన్ స్వీకరించాలని సూచించింది. ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. నామినేషన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

English summary
High Court of Andhra Pradesh nod the petition of Gorantla Madhav, who is the candidate of YSR Congress Party from Hindupur Lok Sabha in Anathapur district. On Monday, High Court quashed the Stay Petition filed by Government of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X