కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"చెన్నంపల్లి కోట"లో తవ్వకాల వివరాలివ్వండి: ఎపి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chennampalli Fort Excavation : చెన్నంపల్లికోటలో...విలువైన ఖనిజాలు | Oneindia Telugu

కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ఎపి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె. జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై మీడియాలో వస్తున్న వార్తా కథనాలను కర్నూలు జిల్లా, దూపాడుకు చెందిన బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాల పేరుతో చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ ఆయన హైకోర్టుకు లేఖ రాశారు.

High Court asks AP Government to give details of Chennampalli fort dig

దీన్ని పరిశీలించిన ఏసీజే జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్ ఈ లేఖను పిల్ గా మలచాలని సూచించడంతో ఆ మేరకు మార్పు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

English summary
The High Court tuesday asked the Andhra pradesh Government to furnish details of excavations in Chennampalli fort of Kurnool district in search of treasure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X