తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. వెయ్యి కోట్ల డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లోనా?: టీటీడీపై హైకోర్టు ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీకి చెందిన వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది.

జాతీయ బ్యాంకులను కాదని, ప్రైవేటు బ్యాంకుల్లో ఎలా డిపాజిట్ చేస్తారని హైకోర్టు టీటీడీని నిలదీసింది. నిధుల భద్రత ముఖ్యమా? వడ్డీ ముఖ్యమా? అని ప్రశ్నించింది. టీటీడీ వినిపించిన వాదనపై కోర్టు సానుకూలంగా స్పందించలేదు. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ టీటీడీని హైకోర్టు ఆదేశించింది.

High Court fires at TTD for deposits in private banks

ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బును డిపాజిట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి పిల్ వేశారు. అందులో టీటీడీ నిబంధనలు పాటించుకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.వెయ్యికోట్ల వరకు డిపాజిట్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఈ మేరకు స్పందించింది.

English summary
High Court fired at TTD for deposits in private banks issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X