హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీబీఐ కోర్టులో జగన్ హాజరుపై హైకోర్ట్ లో విచారణ ..హైకోర్టు ఏం చెప్పిందంటే

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . ఇక ఈ నేపధ్యంలో తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల ను నిర్వహించే నిమిత్తం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ కోర్టు నిరాకరించటంతో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించారు జగన్ .

సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసి జగన్ హాజరు కావాలని తేల్చి చెప్పింది. నేరానికి హోదాకు సంబంధం లేదని పేర్కోంది. ఇక దీంతో ఆయన ఈసారి హైకోర్టును ఆశ్రయించారు. సీఎం జగన్ తన అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన జగన్ పిటీషన్ ను హైకోర్టు విచారించింది.

High Court hearing on Jagans attendance in CBI court ... What the High Court has said

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ ను ఫిబ్రవరి ఆరు కు వాయిదా వేశారు. గత శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయింపును కొట్టి వేస్తూ తప్పని సరిగా సీఎం జగన్ హాజరు కావాలని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యం లో తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించిన నేపధ్యంలో సీబీఐ కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించారు. మరి సీబీఐ కౌంటర్ దాఖలులో ఎలాంటి అంశాలు ఉంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Jagan have to appear in court next Friday for his illegal assets case. This time he resorted to the High Court. The High Court in the hearing had directed the CBI to file a counter with the full details. The hearing of the case has been postponed to February 6. It was interesting to see what the CBI counters in the filing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X