వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై దాడి కేసులో కేంద్ర, రాష్ట్రం హోం శాఖలకు హైకోర్టు నోటీసులు.. సీసీ ఫుటేజ్ లేదన్న సిట్.. ధర్మాస

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర హోంశాఖలతో పాటు ఇరు రాష్ట్రాల డీజీపీలు సహా ఏడుగురికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో భద్రత లోపభూయిష్టంగా ఉందంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సీల్డ్ కవర్ లో విచారణ రిపోర్ట్ ను మరోసారి అందించాలని సిట్ అధికారులకు సూచించింది. తదుపరి విచారణ నిమిత్తం ఈకేసును రెండు వారాలకు వాయిదా వేసింది.

high court issued notice to chandrababu in jagan attack case

వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసు వివరాలను సిట్ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. అనంతరం జగన్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈ సమయంలో సీసీ టీవీ ఫుటేజ్ పై సిట్ అధికారులను ప్రశ్నించింది ధర్మాసనం. అయితే మూడు నెలలుగా ఫుటేజ్ లేదని వారు సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

English summary
high court issued notice to central and state home ministries in jagan attack case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X