వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల‌కృష్ణ‌కు హైకోర్టు నోటీసులు : ఓట‌ర్లకు డ‌బ్బు పంచిన వ్య‌వ‌హారం ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP High Court Issued Notices To TDP Mla Nandamuri Balakrishna | Oneindia Telugu

ప్ర‌ముఖ సినీ న‌టుడు..టిడిపి ఎమ్మెల్యే బాల‌కృష్ణ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నిక సంద ర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ వ్య‌వ‌హారం లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

నంద్యాల లో డ‌బ్బు పంచారంటూ..
నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేర‌కు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కె.శివకుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

High court issues notices to Balakrishna : money distribution in nandyala

కోర్టు నోటీసులు జారీ..
ఈ పిటిషనర్‌ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నిక సంద ర్భంగా రోడ్‌షో నిర్వహించి, తరువాత ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళి ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. అందువల్ల బాలకృష్ణపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో బాలకృష్ణ వాదనలు వినడం తప్ప నిసరని స్పష్టం చేసింది. అందులో భాగంగా బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణకు నోటీసులు అందచేసే వెసులుబాటును పిటిషనర్‌కు కల్పించింది. మరోవైపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘా న్ని ఆదేశించింది. కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

English summary
AP High court issued notices to cine hero and TDP Mla Nandamuri Balakrishna. Siva kumar filed case in court that Balakrishna distributed money In Nandyala elections. In this case court directed Elections commission to file counter in four weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X