వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగులు ప్రజా సేవకులు: హైకోర్టు, కేంద్రమంత్రుల భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఉద్యోగులు ప్రజా సేవకులు అని, ప్రజలకు ఇబ్బందులు కలిగితే చర్యలు తీసుకునే అధికారం కోర్టులకు ఉందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ఎపిఎన్జీవోల సమ్మె పిటిషన్ పైన వాదనలు ప్రారంభమయ్యాయి.

ఉద్యోగులు ప్రజల సేవ కోసమే ఉన్నారని, ప్రజల కోసమే పని చేయాలని హైకోర్టు సూచించింది. ప్రజా సమస్యలపై ఏ వ్యవస్థ స్పందించనప్పుడు చర్యలకు ఆదేశించే అధికారం కోర్టులకు ఉందన్నారు. ఉద్యోగులకు జవాబుదారీతనం, పారదర్శకత తప్పనిసరి అని తెలిపింది.

ఈ సందర్భంగా ఎపిఎన్జీవోల సమ్మె తరఫు న్యాయవాది.. తమ సమ్మె ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని, ప్రజల నుంచి సమ్మెపై ఫిర్యాదులు రావడం లేదని, ప్రజలకు కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం ఉందని తెలిపారు. తాము చేస్తోంది సమ్మె కాదని హక్కుల కోసం పోరాటమన్నారు.

ఢిల్లీలో కేంద్రమంత్రుల, ఎంపీలు భేటీ

ఢిల్లీలో కేంద్ర మంత్రులు, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సెంట్రలు హాలులో భేటీ అయ్యారు. వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. తెలంగాణ నోట్ వస్తే రాజీనామా చేసేందుకు కొందరు ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. వారు మీరా కుమార్ అపాయింటుమెంట్ కూడా అడిగారు. ఏం చేయాలనే అంశంపై కేంద్రమంత్రులు తర్జన భర్జన పడుతున్నారు.

24న తిరుమలకు మినహాయింపు లేదు

ఈ నెల 24న సీమాంధ్ర బందు సందర్భంగా తిరుమలకు ఎలాంటి మినహాయింపు లేదని సమైక్యాంధ్ర ఉద్యోగ ఐకాస తెలిపింది. భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరింది. ఆర్టీసితో పాటు ప్రయివేటు వాహనాలను నిలిపి వేస్తామని తెలిపింది.

English summary
The hearing on Friday started in High Court of 
 
 Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X