వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు: అఫిడవిట్ దాఖలుకు ఆదేశం: కోర్టుకెళ్లిన రైతులు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP 3 Capitals : Amaravati Farmers Filed Petition On Capital Cotroversy || Oneindia Telugu

రాజధాని వ్యవహారం హైకోర్టుకు చేరింది. ప్రభుత్వం రాజధానితో పాటుగా నగరాల డెవలప్ మెంట్ పైన అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ..రాజధాని పేరుతో తమ వద్ద భూములు సేకరించి..ఇప్పుడు రాజధాని పైన అధ్యయనం ఏంటంటూ రైతులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులంటూ చేసిన వ్యాఖ్యల తో అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు.

రాజధాని రచ్చ: కొనసాగుతున్న బంద్.. దేవినేని ఉమా అరెస్ట్: అమరావతిలో 144 సెక్షన్..!రాజధాని రచ్చ: కొనసాగుతున్న బంద్.. దేవినేని ఉమా అరెస్ట్: అమరావతిలో 144 సెక్షన్..!

దీని మీద నిరసనలు కొనసాగిస్తూనే..న్యాయ పోరాటం ప్రారంభించారు. దీంతో..ప్రభుత్వం నియమించిన కమటీ..ఆ కమిటీకి అప్పగించిన బాధ్యతల మీద హైకోర్టు లో దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ సాగింది. దీని పైన హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ప్రభుత్వం ఈ వ్యవహారం పైన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

High court orderd AP govt to file affadavit on constitution of capital committe

ముఖ్యమంత్రి జగన్ శాసనసభా వేదికగా ఏపీలో మూడు రాజధానులు అంటూ చేసిన ప్రకటనతో అమరావతి రైతులు..స్థానికులు ఆందోళన బాట పట్టారు. దీంతో..స్థానికులు రాజధాని పరిరక్షణ పేరుతో హైకోర్టు ను ఆశ్రయించారు. తాము రాజధాని తమ ప్రాంతంలో నిర్మిస్తామంటూ స్వచ్చందంగా భూములు ఇచ్చామని..తమ భూములు తీసుకొని..ఇప్పుడు రాజధాని మార్పు అంటూ కమిటీ ఏర్పాటు చేయటం ఏంటని వారు కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ప్రశ్నించారు.

రాజధాని మారిస్తే తాము నష్టపోతామని..ఇప్పటికే తాము ఇచ్చిన భూములు తిరిగి వ్యవసాయానికి కూడా ఉపయోగడవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు బంద్ నిర్వహిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఇదే సమయంలో న్యాయ పోరాటం సైతం ప్రారంభించారు. అందులో భాగంగా దాఖలు చేసిన పిటీషన్ పైన హైకోర్టులో విచారణ సాగింది. దీని పైన ప్రభుత్వ సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నిర్దేశించింది.

English summary
High court orderd AP govt to file affadavit on constitution of capital committe. Amaravati farmers filed petition on Capital cotroversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X