వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీఎన్జీవోల భూములపై టి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోపన్‌పల్లిలోని ఏపీఎన్జీవో భూముల విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎన్జీవోల భూములలో యథాతథ స్థితిని కొనసాగించాలని హైదరాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఏపీఎన్జీవో సంఘానికి కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోటీసులిచ్చినా సొసైటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. గురువారం స్వాధీనం చేసుకుని సర్కారు స్థలమంటూ బోర్డులు పాతింది.

High Court orders on APNGOs land

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వేనంబరు 36, 37లోని 189.11 ఎకరాల భూమిని ప్రభుత్వం 2005లో ఏపీఎన్జీవోల హౌసింగ్‌ సొసైటీకి కేటాయించింది. ఈ భూముల్లో ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో పాటు, సొసైటీ సభ్యులెవరో కూడా ఇంత వరకు తేల్చకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ఈ భూములను వెనక్కి తీసుకునే విషయమై బుధవారం రాత్రి రెవెన్యూ ముఖ్య అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయంకల్లా ఫైలుపై సంతకం చేసిన రెవెన్యూమంత్రి మహమూద్‌ అలీ, సీఎం కేసీఆర్‌కు పంపించారు. ఆ వెంటనే సీఎం కూడా ఆమోదించారు.

మెమో జారీ

హైదరాబాదులోని గోపన్‌పల్లిలో ఏపీఏన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల 14 గుంటల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది.

English summary
Hyderabad's High Court orders on APNGOs land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X