వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి ఇచ్చే నిధులపై వివరణ ఇవ్వండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాయలసీమ, కోస్తా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన నిధులను ఉపసంహరించడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

మాజీ మంత్రి కొణతల రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనకబడిన జిల్లాలకు 2014 నుంచి ఏటా రూ.350 కోట్లు చొప్పున కేంద్రం నిధులను మంజూరు చేస్తోందని పిటిషన్‌లో కొణతాల పేర్కొన్నారు.

 high court questions centre on Rs. 350 crores funds

అయితే ఈ ఏడాది రూ.350 కోట్లు ఆమోదం లభించలేదని, ఆ నిధులను కేంద్రం వెనక్కి తీసుకుందన్నారు. కాబట్టి నిధులను వెంటనే మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కొణతాల కోరారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

English summary
High Court questioned Central Government on Rs. 350 crores funds to be issue to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X