కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా హత్యకేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటీషన్ల పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యకేసు సీబీఐ కి అప్పగించాలని దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల కాలంలో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, త్వరిత గతిన విచారణ జరిపించాలని , కేసును సీబీఐకి ఇవ్వాలని వేసిన పిటిషన్లపై ధర్మాసనం సుధీర్ఘంగా విచారణ జరిపింది .

 వివేకా కేసు సీబీఐకి అప్పగించాలన్న పిటీషన్లపై విచారణ

వివేకా కేసు సీబీఐకి అప్పగించాలన్న పిటీషన్లపై విచారణ

వివేకా హత్యకేసును సీబీఐకు అప్పగించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీత పిటీషన్లు వేశారు. ఇక వీరి తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. బీటెక్ రవి తరఫున కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. ఇక ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక, జనరల్‌ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు.

కోర్టులో సీబీఐ కి అప్పగించాలని, వద్దని ప్రభుత్వ , ప్రతివాదుల న్యాయవాదుల వాదనలు

కోర్టులో సీబీఐ కి అప్పగించాలని, వద్దని ప్రభుత్వ , ప్రతివాదుల న్యాయవాదుల వాదనలు

సీఎం జగన్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు మెమో దాఖలుపై వివేకానందరెడ్డి కూతురు తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసును రాష్ట్ర పోలీసులు సమర్థంగా వ్యవహరించలేదని ఈ కేసులో ఇద్దరు కింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేశారని అందుకే ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇక సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ ఉపసంహరణపై సీఎం జగన్‌ తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు.

Recommended Video

మళ్లీ వాయిదా పడ్డ వైసిపి అభ్యర్థుల తొలి జాబితా.. వాయిదాకు కారణం ఇదే ! | Oneindia Telugu
 తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు .. తీర్పుపై ఆసక్తి

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు .. తీర్పుపై ఆసక్తి


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేసును నీరుగార్చే అవకాశం ఉందని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరిన విషయాన్ని హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌ ప్రస్తావించారు . ఇక తాజాగా కర్నూలుకు సంబంధించిన సుగాలి ప్రీతీ కేసును సీబీఐకి ఇస్తామని ప్రకటన చేశారని మరి వివేకా కేసులో అభ్యంతరమేంటని పిటిషనర్‌ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు తీర్పు రిజర్వు చేసింది. ఇక ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

English summary
The murder case of former minister Vivekananda Reddy, who created the turmoil in Telugu states, has been heard in the AP High Court today. The court has today reserved its verdict on the petitions filed to hand over the Viveka murder case to the CBI. In recent times, the SIT has not relied on the probe, and the court has long held a hearing on petitions seeking a fast-track trial and the case being handed over to the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X