వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి వేళ పందెం రాయుళ్లకు నిరాశ: కోడి పందేలకు హైకోర్టు నో

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్‌లతో కూడిన కోడి పందాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్ కుమార్ ఈ అంశంపై పిల్ దాఖలు చేశారు. ఈ కేసులో జంతు సంక్షేమ బోర్డు ఇంప్లీడ్ అవుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

2014లో పిటిషనర్ పిల్‌ను దాఖలు చేసినప్పుడు ప్రభుత్వం ప్రకటనతో పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు ప్రకటించిందని జంతు సంక్షేమబోర్డు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత మరొక పిటిషనర్ ఇదే విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, యథాతథ స్ధితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోడి పందాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలా అనుమతించారని హైకోర్టు ప్రశ్నించింది.

High Court says no to cock fights

ఆ తర్వాత హైకోర్టు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల వివరాలను గురువారం హైకోర్టు బెంచికి సమర్పించాలని ఆదేశించింది. ఈ పిటిషనన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోంస్లే, జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి లీగల్ సర్వీసెస్ అథారిటి చైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్‌ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ పోస్టులో జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోస్లే కొనసాగారు.

బోస్లేను ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయింది. దాంతో ఈ ఖాళీని రమేష్ రంగనాథన్‌తో భర్తీ చేశారు. ఈ మేరకు హోం (కోర్టులు-ఎ) శాఖ కార్యదర్శి టి. నారాయణరెడ్డి పేరుతో మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

English summary
High Court said that cock fights will not be allowed in Andhra Pradesh during Sankranthi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X