వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడి పందాలపై...ఆదేశాలను అపహాస్యం చేస్తారా?.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తాము ఇచ్చిన ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితం అవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని, ఇది అత్యంత దురదృష్టకరమని
హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు జరగడానికి వీల్లేదని తాము ఆదేశించినా పందేలు యథాతథంగా జరిగాయని, స్వయంగా ప్రజా ప్రతినిధులే పందేలకు హాజరయ్యారని హై కోర్టు వ్యాఖ్యానించింది. ఎపిలో జరిగిన కోడి పందేలను ప్రపంచమంతా చూసిందని పేర్కొంది. అరుదుగా టీవీలు చూసే తమకే, టీవీల్లో కోడి పందేల దృశ్యాలు పదే పదే కనిపించాయని తెలిపింది.

 మీరు ఏమీ చెయ్యలేకపోతే...ఆ విషయం హైకోర్టుకు...

మీరు ఏమీ చెయ్యలేకపోతే...ఆ విషయం హైకోర్టుకు...

కోడి పందాల విషయంలో హై కోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), ఏపీ డీజీపీ అమలు చేసేందుకు చర్యలు చేపట్టకపోవడాన్ని హై కోర్టు తప్పుబట్టింది. "కోడి పందేల విషయంలో ఏమీ చేయలేమంటూ మీరు నిస్సహాయత వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని హైకోర్టకు తెలపాలి. అప్పుడు మిగిలిన విషయాలను మేం చూసుకుంటామని' అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

 మా ఆదేశాలు...సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు...

మా ఆదేశాలు...సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు...

రాష్ట్రంలో కోడి పందేలు జరిగిన తీరును చూస్తుంటే మా ఆదేశాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికలు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని హై కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నివేదికలు ఇవ్వకపోవడమే కాక, మరింత గడువు కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.
తమ ఆదేశాల ప్రకారం నివేదికలు సమర్పించనందుకు అటు సీఎస్‌ దినేష్‌కుమార్, ఇటు డీజీపీ ఎం.మాలకొండయ్యను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.

 నివేదికలు ఎందుకు ఇవ్వలేదో...వివరణ ఇవ్వండి...

నివేదికలు ఎందుకు ఇవ్వలేదో...వివరణ ఇవ్వండి...

కోడి పందాలపై తమ ఆదేశాల అనుసారం ఎందుకు నివేదికలు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని సీఎస్‌ దినేష్‌కుమార్, ఇటు డీజీపీ ఎం.మాలకొండయ్యకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజ్‌ గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 కలిదిండి రామ చంద్రరాజు...పిల్ నేపథ్యంలో.

కలిదిండి రామ చంద్రరాజు...పిల్ నేపథ్యంలో.

గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాలలో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, ఈ సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామ చంద్రరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోకపోవడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary
High Court fired on cock fights in AP over violation of previous court orders. In this regard, HC Serious to AP CS and DGP why they allow cock fights and ordered attend to court on 29 of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X