వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు: ఆ సాక్ష్యాలున్నాయి.. విచారణ ఎదుర్కోవాల్సిందే!

కలెక్టర్ పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారన్న దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందునా.. పిటిషన్ కొట్టివేసేందుకు నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంతో జగన్ పై దాఖలైన కేసు పట్ల కోర్టు ప్రతికూలంగా స్పందించింది. కేసును కొట్టివేయాల్సిందిగా జగన్ తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

కలెక్టర్ పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారన్న దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందునా.. పిటిషన్ కొట్టివేసేందుకు నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది. కాగా, గతంలో కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయంలో.. కలెక్టర్ బాబుకు మధ్య నందిగామ ప్రభుత్వాసుపత్రిలో వాగ్వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

 highcourt dismisses jagan's quash petition over collector issue

నందిగామ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించడానికి జగన్ వెళ్లగా.. పోస్టు మార్టమ్ రిపోర్టుపై కలెక్టర్ తో వాగ్వాదం జరిగింది. 'ఆల్ ది డిపార్ట్ మెంట్స్ ఫ్రం పోలీస్ టు కలెక్టర్ స్టాండ్స్ కరప్ట్. మీరు చేసినవన్నీ కూడా పర్ ఫెక్ట్ గా ఎంక్వయిరీ జరిపిస్తాం.. మిమ్మల్ని కూడా సెంట్రల్ జైలుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేపడుతాం' అంటూ ఆ సమయంలో కలెక్టర్ పట్ల జగన్ ఫైర్ అయ్యారు.

<strong>బస్సు ప్రమాదం-మావల్ల కాదన్న వైసిపి నేతలు: ఆ రోజు జగన్ ఏం చేశారంటే..!</strong>బస్సు ప్రమాదం-మావల్ల కాదన్న వైసిపి నేతలు: ఆ రోజు జగన్ ఏం చేశారంటే..!

ప్రమాదంలో చనిపోయిన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయకుండా తరలిస్తుండటాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇదే క్రమంలో ఆ మృతదేహానికి సంబంధించిన పేపర్లను డాక్టర్ వద్ద నుంచి లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద ఓ కలెక్టర్ పట్ల, డాక్టర్ పట్ల జగన్ అలా వ్యవహరించడంపై అప్పట్లో అధికార పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఆపై కేసు నమోదవడంతో.. న్యాయపరంగా జగన్ దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

English summary
Highcourt was dismissed YSRCP president Jagan's petition over collector Babu's issue. We know that during Jagan's visit to Nandigama hospital skirmish took place
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X