వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్ర‌కాశం: అత్య‌ల్పం .. విశాఖ జిల్లాలో..!

|
Google Oneindia TeluguNews

అర్దరాత్రి వ‌ర‌కు సాగిన ఏపి ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్ న‌మోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుంద‌ని భావించినా గ‌తం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ న‌మోదైంది. అధికంగా ప్ర‌కాశం జిల్లాలో పోలింగ్ న మోదు కాగా..అత్య‌ల్పంగా విశాఖ జిల్లాలో న‌మోదైంది. ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అద్దంకి లో 89.82 శాతం తో తొలి స్థానం లో నిలిచింది.

Recommended Video

Morning News Roundup
మ‌హిళ‌ల ఓటింగ్ శాతం ఎక్కువ‌..

మ‌హిళ‌ల ఓటింగ్ శాతం ఎక్కువ‌..

ఏపిలో ఓటింగ్ క్యూ లైన్లు చూసి పోలింగ్ దాదాపు 85 శాతం వ‌ర‌కు వెళ్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఏపిలో మొత్తంగా పోలింగ్ శాతం 79.64 గా ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. పోలింగ్ ప్రారంభం అయిన స‌మ‌యం నుండి ఇవీయం లు మొరాయించాయి. అర్ద‌రాత్రి వ‌ర‌కు పోలింగ్ జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల్లో ఏపి లో మొత్తం 3,13,33,631 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 1,55,45,211 మంది పురుషులు, 1,57,87,759 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు ఓక్కువగా ఓటు వినియో గించుకున్నారు. 2014లో 78.41 శాతం పోలింగ్ నమోదు కాగా... ఈసారి పోలింగ్ శాతం మరింత పెరిగింది. గత ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లకుగాను 2.87 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. ప్రస్తుత ఎన్నికల్లో 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. గ‌త ఎన్నికల కంటే ఈ సారి 26 లక్షల మంది అధికంగా ఓటేసిన‌ట్లు లెక్కలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

అత్య‌ధికం ప్ర‌కాశం..అత్య‌ల్పం విశాఖ‌..

అత్య‌ధికం ప్ర‌కాశం..అత్య‌ల్పం విశాఖ‌..

ఏపి ఎన్నికల్లో అత్యధికంగా ప్రకాశంజిల్లాలో 85.98 శాతం మేరకు ఓటింగ్‌ నమోదైంది. ఇక‌, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 71.81 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి 89.82 శాతంతో అత్యధిక ఓటింగ్‌ జరిగిన నియోజకవర్గంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లాలోని జగ్గ య్యపేట 89.64 శాతం, ప్రకాశం జిల్లా దర్శి 89.62 శాతం ఓట్ల పోలింగ్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక‌, రెండు స్థానాల్లో రీ పోలింగ్ కు సిఫార్సు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ఇప్ప‌టికే ఇవియం ల‌ను సుర క్షితంగా స్ట్రాంగ్ రూం ల‌కు చేర్చామ‌ని చెప్పారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇస్తే ఆ రెండు కేం ద్రాల్లో రీ పోలింగ్ ఎప్పుడు నిర్వ‌హించేదీ ప్ర‌క‌టించ‌నున్నారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం..

జిల్లాల వారీగా పోలింగ్ శాతం..

ఇక‌, జిల్లాల వారీగా ఏపిలో పోలింగ్ శాతం ప‌రిశీలిస్తే.. శ్రీకాకుళం - 75.14, విజయనగరం - 80.68, విశాఖ పట్నం - 71.81, తూర్పుగోదావరి - 80.08, పశ్చిమగోదావరి - 82.19, కృష్ణా - 81.12, గుంటూరు - 82.37, ప్రకాశం - 85.93, నెల్లూరు - 76.68, కడప - 77.21, కర్నూలు - 77.68, అనంతపురం - 81.90, చిత్తూరు - 81.03 గా న‌మోదైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. అయితే, విశాఖ జిల్లా మిగిలిన 12 జిల్లాల కంటే పోలింగ్ లో వెనుక‌బ‌డి ఉండ‌టం ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. దీనికి గ‌త కార‌ణాల పై చ‌ర్చ సాగు తోంది. ఇక‌, ఫ‌లితాల కోసం మ‌రో 40 రోజుల పాటు నిరీక్షించాల్సి ఉంది.

English summary
In Ap General elections Total turn out is 79.64 percent. EC officially announced dist vise polling details last night. In Ap Prakasam dist is in Top and Viskakha is in last position. In two polling booths in Guntur dist. CEO recommended for re polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X