వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ శివప్ర‌సాద్‌పై హిజ్రాల ఫిర్యాదు...తమ వేషధారణలో అవమానించారని!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎంపీ శివప్ర‌సాద్‌పై హిజ్రాల ఫిర్యాదు

కర్నూలు: టిడిపి ఎంపీ శివప్రసాద్ పై హిజ్రాలు ఆగ్రహం చెందారు. పార్లమెంటు ముందు తమ వేషధారణతో తమను ఎంపి అవమానించారని హిజ్రాలు నంద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణంలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలో భాగంగా ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణలో తన నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఆయన శుక్రవారం హిజ్రా వేషంలో ఆందోళన నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం తెలుగు దేశం పార్టీ పోరాటంలో భాగంగా టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో 18వ రోజూ ఆందోళన చేపట్టారు. రోజుకో వేషధారణతో ఈ ఆందోళనలో పాల్గొంటున్న చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ గురువారం హిట్లర్ వేషం ధరించగా, శుక్రవారం ట్రాన్స్ జెండర్ వేషధారణతో...చెవులకు రింగులు, భుజంపై ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చారు.

Hijras complained to the police on MP Shivaprasad

ఆ సందర్భంలో ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ ఎన్ని వేషాలేసినా మోడి మనసు కరగడం లేనందనే ఇక తప్పక ట్రాన్స్‌ జెండర్‌ వేషం వేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపికి అది చేస్తాం...ఇది చేస్తాం అని చెప్పిన మోడి ఇప్పుడు అవన్నీ మరిచిపోవడం దారుణమని ఎంపీ శివప్రసాద్ అన్నారు. తాను
థర్డ్ జండర్ల ప్రతినిధిగా మోడీని నిలదీయడానికి వచ్చానని చెబుతూ, "మోడీ బావా.." అంటూ హిజ్రాల శైలిలో చప్పట్లు కొట్టారు.

"ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం" అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. మాటలెన్నో చెప్పావుగానీ, చేతల్లో ఏమీ చూపలేదంటూ సెటైర్లు వేశారు. ఆయన వేషధారణను చూసి సహచర ఎంపీలతో పాటు వీక్షకులందరూ నవ్వుఆపుకోలేకపోయారు. రోజుకొక విచిత్ర వేషధారణలో భాగంగా హిజ్రా వేషంలో ఆందోళన చేస్తున్న శివప్రసాద్‌ను ఈ రోజు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ , సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అభినందించారు. అయితే ఇప్పుడు ఎంపి శివప్రసాద్ ఆ వేషం పైనే హిజ్రాలు ఆగ్రహించి నంద్యాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.

English summary
Hijras fire on TDP MP Shivaprasad over his transgender get up. For that Hijras complained in Nandyal Police Station that they were humiliated by MP in Parliament premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X