హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బియాస్ ట్రాజెడీ: ఏడుపు ఆపుకోలేకపోయారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/సిమ్లా: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు కోసం మానవ రహిత విమానాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి.

ఏడీజీ రాజవ్ త్రివేదీ ఘటనాస్థలికి వచ్చారు. ఇంగ్లిష్ చానెల్ ఈదిన అనుభవం తనకుందని, గాలింపు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని చెప్పారు.

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, ఎన్డీఆర్ఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, టిడిపి ఎంపీలు కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన విద్యార్థుల్లో 8 మృతదేహాలను వెలికితీయగా, 16 మంది మృతదేహాలు లభించాల్సి ఉంది.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

విహార యాత్ర కోసం వెళ్లి బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన 24 మంది విద్యార్థులకు నగరవాసులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

గురువారం రాత్రి ఎన్టీఆర్ గార్డెన్ నుంచి లుంబినీ పార్కు వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పి విజయా రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

లుంబిని పార్కువద్ద కొవ్వొత్తులను ఉంచి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా విజయా రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపించాలన్నారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

బాధిత కుటుంబాలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయా రెడ్డి కోరారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

విహార యాత్ర కోసం వెళ్లి బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన 24 మంది విద్యార్థులకు నగరవాసులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

విహార యాత్ర కోసం వెళ్లి బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన 24 మంది విద్యార్థులకు నగరవాసులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృతి చెందిన సాబేర్ హుస్సేన్ మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం గుల్‌మొహర్‌పార్కులోని వారి ఇంటికి తీసుకు వచ్చారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

మహ్మద్ సాబేర్ హుస్సేన్ పార్థివదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. నాలుగు రోజులుగా అతడి కోసం ఎదురు చూస్తుండగా చివరకు విగతజీవిగా రావడంతో వారి రోదనలను ఆపడం ఎవరితరం కాలేదు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

ఎంతో చలాకీగా ఉండే తమ తనయుడు ఇక లేడనే విషయాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. సాయంత్రం 5 గంటలకు లింగంపల్లిలోని మసీద్‌లో ప్రార్థనల అనంతరం లింగంపల్లి మైనార్టీ శ్మశాన వాటికలో కుటుంబీకులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

అంతకుముందు సాబేర్ హుస్సేన్ పార్థివదేహాన్ని తీసుకొస్తున్నారని తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు తండోపతండాలుగా అతడి ఇంటికి తరలొచ్చారు. మృతదేహాన్ని కడసారి చూసి వీడ్కోలు పలికారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన సాబేర్ హుస్సేన్ పార్థివదేహాన్ని గురువారం మధ్యాహ్నం అధికారులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

సాబేర్ మృతదేహం ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం 11గంటలకు శం షాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 12గంటలకు లింగంపల్లిలోని గుల్‌మొహర్‌కాలనీలోని స్వగృహానికి తీసుకొచ్చారు.

బియాస్ ట్రాజెడీ

బియాస్ ట్రాజెడీ

ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు, నియోజవర్గానికి చెం దిన ప్రజాప్రతినిధులు తరలొచ్చి సాబేర్ పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

English summary
Search operations launched to retrieve the bodies of 24 engineering students and one tour operator, who were washed away in Beas river near Thalout in Mandi district on Sunday, has so far recovered only eight bodies, while 16 others are still missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X