బియాస్ విషాదం: మరో ముగ్గురి మృతదేహాలు లభ్యం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో గురువారం ఉదయం రెండు మృత దేహాలు అభ్యమయ్యాయి. గురువారం మధ్యాహ్నం మరో విద్యార్థి మృత దేహం లభ్యమైంది. మాచర్ల అఖిల్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు 12 మృత దేహాలు లభ్యమయ్యాయి.
ఇంకా 12 మృత దేహాలు లభ్యం కావాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను అధికారులు హైదరాబాద్‌కు పంపనున్నారు. గురువారం ఉదయం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విద్యార్థులు శివప్రకాశ్ వర్మ, ఆశిష్ మంథాల మృతదేహాలుగా గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు తల్లిదండ్రులకు సమాచారమందించారు.

గురురవారం సాయంత్రానికి శివప్రకాశ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. కాగా, సికింద్రాబాద్ చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన ఆశీష్ మంథా ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చి, అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని అతని స్నేహితులు చెప్పారు.
ఏడాది క్రితం భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆశీష్ తల్లి సత్యవాణి ఈ వార్త విని కన్నీంటిపర్యంతమైంది.
మొత్తం 24 మంది బియాస్ నదిలో గల్లంతవగా ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 12మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!