అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ మాధవ్ నిరసనతో కలకలం : మంత్రులు..విదేశీ ప్రతినిధుల ముందే : జగన్ ఆగ్రహం...!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనలోని అసహనాన్ని ఆపుకోలేక పోయారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు..మంత్రుల సమఓంలోనే ఓపెన్ అయిపోయారు. అది కూడా కామెంట్ రూపంలో అందరిలో చర్చకు కారణమయ్యారు. ఇది చివరకు ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన అంశాల్లో ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా అంటూ ఆగ్రహించారు. తన వద్దకు రావాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కలకలంగా మారిన మాధవ్ వ్యవహారం పైన సీఎం ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

కియో కారు ఆవిష్కరణలో మాధవ్ కలకలం..

కియో కారు ఆవిష్కరణలో మాధవ్ కలకలం..

కియో తొలి కారు ఆవిష్కరణకు హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ సంస్థ యాజమాన్యంపైన మండి పడ్డారు. కియో యాజమన్యం ఇప్పటికీ చంద్రబాబు మత్తులోనే ఉన్నట్లుగా ఉందని.. ఆయన దర్శకత్వంలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కారు ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్త కారు పైన ఏపీ మంత్రులు సంతకాలు చేసి శుభాకాంఓలు తెలుపుతూ కామెంట్లు రాసారు. అయితే ఎంపీ మాధవ్ మాత్రం నిరసన వ్యాఖ్యలు రాసినట్లు సమాచారం. కియ కార్ రోల్ అవుట్..బట్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ ఈజ్ రూల్డ్ అవుట్ అని మాటను రాసి సంతకం చేసారు. దీనిని అక్కడ చూసిన సంస్థ ప్రతినిధులతో పాటుగా మంత్రులు సైతం విస్మయానికి గురయ్యారు. వెంటనే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరింది. ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ ఈ రకంగా వ్యవహరిం చటం పైన చర్చ మొదలైంది. సంస్థ ప్రతినిధులు దీని పైన స్పందించకపోయినా..మొత్తం పరిణామాలను పరిశీలిస్తూనే ఉన్నారు.

సీఎం జగన్ అభినందిస్తుంటే..ఎంపీ ఇలా..

సీఎం జగన్ అభినందిస్తుంటే..ఎంపీ ఇలా..

కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు కాలేక పోయారు. ఆయన తన సందేశాన్ని మంత్రి బుగ్గన ద్వారా పంపిచారు. అందులో కియ పరిశ్రమ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజన్‌. 2007లో అప్పటి హుండయ్‌ ముఖ్య అధికారితో వైఎస్‌ రాష్ట్రంలో కార్ల పరిశ్రమ పెట్టే అంశాన్ని చర్చించారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు..అంటూ సీఎం జగన్ సందేశంగా వినిపించారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ మాధవ్ మాత్రం కియా ఇంకా చంద్రబాబు మత్తులోనే ఉన్నట్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. స్థానికులకు 75 శాతం ుద్యోగాలు అని చెప్పిన విషయాన్ని మాధవ్ గుర్తు చేస్తున్నారు. కియా సంస్థ స్థానికులకు అవకాశం కల్పించటం లేదని..స్థానిక యువతను కనీసం పరిశ్రమలోకి రానీయకుండా అవమానించారంటూ తనలోని ఆగ్రహాన్ని మొత్తంగా వెల్లగక్కారు. ఎక్కడి నుండో తీసుకొచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని.. స్థానికులకు వాచ్ మెన్లు.. క్లీనింగ్ వంటి పనులు ఇచ్చారని మండి పడ్డారు. సంస్థ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో సైతం ఎక్కడా సీఎం.. మంత్రులు..స్థానిక నేతల పేర్లు లేవని మండి పడ్డారు. ఈ వ్యవహారం పైన జగన్ తో సమావేశమవుతానని చెప్పుకొచ్చారు.

జగన్ వద్దకు వ్యవహారం..

జగన్ వద్దకు వ్యవహారం..

కియా కార్ల ఆవిష్కరణ వద్ద ఎంపీ మాధవ్ కారు పైన రాసిన కామెంట్ అదే విధంగా..ఆయన అభ్యంతరాల పైన ముఖ్యమంత్రి పార్టీ నేతలు సమాచారం అందించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీగా ఉంటూ ీ రకంగా చేయటం ఏంటని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మాధవ్ ను తన వద్దకు రావాలంటూ జగన్ సూచించారు. కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవటం పైన టీడీపీ నేతలు అసంతప్తి వ్యక్తం చేసారు. ఏపీకి పరిశ్రమల కోసం ప్రత్యేకంగా సెమినార్లు నిర్వహిస్తున్న సమయంలో ఎంపీ ఇలా చేయటం ఏంటంటూ వైసీపీలో చర్చ మొదలైంది. ఇప్పుడు సీఎం జగన్ దీని పైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

English summary
Hindupupram MP Gorantla Mahav comments writtenon KIO car is now became political controversy. Mahdav disappointed with KIO not giving jobs for local people. CM Jagan serious on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X