వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలు

|
Google Oneindia TeluguNews

టిడిపి ఎంపి జేసి దివాక‌ర్ రెడ్డి పై మీసం మెలేసీ హీరోగా నిలిచిన గోరంట్ల మాధ‌వ్ వైసిపి అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఆ య‌న హిందూపూర్ నుండి ఎంపి అభ్య‌ర్దిగా వైసిపి నుండి బ‌రిలో ఉన్నారు. అయితే, ఇక్క‌డే అధికార పార్టీ కొత్త ఎత్తుగ‌డ వేసింది. అస‌లు ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయటానికి అర్హుడా కాదా..అనే విష‌యం ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది.ఈ అంశ‌మే ఇప్పుడు అనంత‌పురం జిల్లా వైసిపి లో కొత్త టెన్ష‌న్ కు కార‌ణ‌మ‌వుతోంది..

మాధ‌వ్ పోటీ పై కొత్త అనుమానాలు..
కొద్ది రోజుల క్రితం అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి పోలీసు అధికారుల పై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ..మీసం మెలేసిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ఆ జిల్లాలో ప్ర‌తీ ఒక్క‌రికీ సుప‌రిచితులు. ఆయ‌న అనూహ్యంగా రాజ‌కీయా ల్లోకి ప్ర‌వేశించి..వైసిపి లో చేరారు. ఆ స‌మ‌యంలోనే త‌న ఉద్యోగానికి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసారు. సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా వైసిపి అధినేత జ‌గ‌న్ ఆయ‌న‌కు హిందూపూర్ ఎంపీగా అవ‌కాశం క‌ల్పించారు. ఇప్ప‌టికే మాధ‌వ్ త‌న ప్ర‌చారం ప్రారంభించారు. అయితే, ఇదే సంద‌ర్భంలో అక్క‌డ టిడిపి మైండ్ గేమ్ ప్రారంభించింది.

HIndupur YCP mp candidate in trouble : technical issue in his contest..

ఇప్ప‌టికే నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం అవ్వ‌టం..ఈ నెల 25న నామినేష‌న్ల‌కు చివ‌ర‌కు తేదీ కావ‌టంతో..ఇక్క‌డ వైసిపి ని టెన్ష న్ పెట్టేందుకు సాంకేతికంగా కొత్త ఎత్తుగ‌డ వేసింది. దీంతో..ఇప్పుడు ఆయ‌న నామినేష‌న్ ఆమోదం పొందాలంటే ఏపి ప్ర‌భుత్వం తీసుకొనే నిర్ణ‌యం కీల‌కంగా మారుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌త్యామ్నాయ మార్గాల మీద మాధ‌వ్ దృష్టి సారించారు. ఇప్పుడు ఇదే విష‌యం హిందూపూర్ వైసిపి లో టెన్ష‌న్ కు కార‌ణ‌మ‌వుతోంది.

ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నిక‌ల వేళ‌..జాతీయ ఛాన‌ల్ స‌ర్వే సంచ‌ల‌నం..!ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నిక‌ల వేళ‌..జాతీయ ఛాన‌ల్ స‌ర్వే సంచ‌ల‌నం..!

ఆమోదం..న్యాయం పోరాటం..

రెండు నెల‌ల క్రిత‌మే మాధ‌వ్ పోలీసు అధికారిక‌గా త‌న ఉద్యోగానికి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసారు. ఆ వెంట‌నే వైసిపి లో చేరారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ కు ఆమోదం ల‌భించ‌లేదు. నామినేష‌న్ల ప‌రిశీల‌న స‌మయానికి ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ ఆమోదం పొంద‌క పోతే ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి అర్హ‌త ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆయ‌న వైసిపి లో చేర‌టం..ఎంపీ అభ్య‌ర్దిగా పోటీ చేస్తుండ‌టంతో ఉద్దేశ పూర్వ‌కం గానే ప్ర‌భుత్వం ఇప్ప‌టి దాకా అయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ అభ్య‌ర్ద‌న‌ను ఆమోదించ‌లేద‌ని చెబుతున్నారు.

సాధార‌ణంగా ఈ అభ్య‌ర్ద‌న‌ను మూడు నెల‌ల్లోగా ఆమోదించ‌క‌పోతే..మూడు నెల‌ల త‌రువాత ఆటో మేటిక్ గా అమోదం పొందిన‌ట్లే భావి స్తారు. అయితే, నామినేషన్ల దాఖ‌లు..ప‌రిశీల‌న స‌మయానికి మూడు నెల‌ల కాలం పూర్తి కాదు. దీంతో..ఇప్పుడు న్యాయ పోరాటం చేయ‌ట‌మా..లేక ఏం చేయాల‌నే దాని పై మ‌ధ‌వ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఎన్నిక‌ల వేళ‌..ఒక ఎంపీ అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించి..ప్ర‌చారం చేసుకుంటున్న స‌మ‌యంలో..ఇది కొత్త చ‌ర్చ‌కు....టెన్ష‌న్ కు కార‌ణ‌మ‌వుతోంది.

English summary
Police officer madhav announced aS YCP Mp candidate form Hinudpur. But, now technical problem arised in his contest. His RS has been not accepted by Govt till now. It may created problem for Madhav for contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X