అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల రవి రక్తపిపాసి - దొంగ చంద్రబాబు అండతో కిరాతకాలు: ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లాకు సంబంధించి పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావడంతో వైసీపీ శ్రేణుల ఉత్సాహానికి హద్దులేకుండా పోయింది. టీడీపీ హాయంలో అనంత జిల్లాకు జరిగిన అన్యాయాలను వివరిస్తూ, వైసీపీ పాలనలో చేస్తోన్న మేలులను సీఎం జగన్ ఎకరువుపెట్టారు. సీఎం బాటలోనే హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం రెండు ప్రభుత్వాల మధ్య తేడాలను వివరిస్తూ కాస్త అత్యుత్సాహానికిలోనై దివంగ నేత పరిటాల రవి, టీడీపీ చీఫ్ చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

RRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామRRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ

 పరిటాల గడ్డకు నీళ్లు..

పరిటాల గడ్డకు నీళ్లు..


అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను జగన్ తాడేపల్లి నుంచే వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. రాప్తాడులో జరిగిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు శంకరనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత ఎంపీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అనూహ్య కామెంట్లు చేశారు..

 చంద్రబాబు దొరికిన దొంగ..

చంద్రబాబు దొరికిన దొంగ..

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు జడ్జి పదవులు ఇవ్వరాదని, జడ్జిలకు బీసీలు పనికిరారని చంద్రబాబు గతంలో నోట్స్ రాశారని, అదే నోటితో వ్యవసాయం దండగ అని కూడా టీడీపీ అధినేత అన్నారని మాధవ్ గుర్తుచేశారు. ఐదు కోట్ల ఆంధ్రులు ఎంతో కీలకమైనదిగా భావించిన ప్రత్యేక హోదాను పశువుల సంతలా.. కేంద్రానికి వేలంలో పెట్టి అమ్మిన వ్యక్తి చంద్రబాబు అని, ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయి.. దొంగలా అమరావతికి పారిపోయాడని ఎంపీ మాధవ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు..

 పరిటాల ఎన్నో తలు నరికాడు..

పరిటాల ఎన్నో తలు నరికాడు..


టీడీపీ చీఫ్ చంద్రబాబుతోపాటు అదే పార్టీకి చెందిన దివంగత నేత పరిటాల రవిపైనా ఎంపీ గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిటాలను రక్తపిపాసిగా అభివర్ణిస్తూ, నాటి అచారకాలకు చంద్రబాబు మద్దతుగా నిలిచారని ఆక్షేపించారు. ‘‘నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికాడు. చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా ఉంటూ ఇలాంటి కిరాతకాలకు పాల్పడ్డాడు. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీళ్లు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపుటేర్లతో పొలాలను తడిపాడు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిది''అని ఎంపీ మాధవ్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహించారని, ఇదే రాప్తాడు నియోజకవర్గంలో ఇవాళ మూడు నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని ఎంపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,

ఎంపీ మాధవ్‌ చొరవతో ప్రత్యేక రైలు

ఎంపీ మాధవ్‌ చొరవతో ప్రత్యేక రైలు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కృషితో కదిరి-అనంతపురం-గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు (ట్రైన్‌ నంబర్‌ -06340) నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు వారంలో నాలుగు రోజుల పాటు నాగర్‌ కోయిల్‌-ఛత్రపతి టెర్మినల్‌ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్‌ కోయిల్‌లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్‌లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది.

ఏలూరు విపత్తు:జగన్ రెడ్డికి సిగ్గుచేటు -భయంతో ఊళ్లు ఖాళీ -ఈ ప్రశ్నలకు బదులేది?: పవన్ కల్యాణ్ ఫైర్ఏలూరు విపత్తు:జగన్ రెడ్డికి సిగ్గుచేటు -భయంతో ఊళ్లు ఖాళీ -ఈ ప్రశ్నలకు బదులేది?: పవన్ కల్యాణ్ ఫైర్

English summary
hindupur ysrcp mp gorantla madhav made sensational comments on tdp chief chandrababu and late tdp leader paritala ravi on wednesday. amid ap cm jagan launches three water projects in anantapur, the mp compares tdp, ysrcp regimes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X