వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి క‌న్నా ఆయ‌న అభిమానులు మ‌రీ సున్నితం సుమీ..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫామిలీ అభిమానులు శిఖ‌రంతో స‌మాన‌మంటే ఆశ్య‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేదు. స్వ‌యంక్రుషితో అసాద్యాల‌ను సుసాద్యం చేసి ఉన్న‌త శిఖ‌రాల‌ను అందుకున్న చిరంజీవి కి అభిమానుల వెల్లువ కూడా స‌ముద్ర‌మంత ఉంటుంది. చిరంజీవి సినీ జీవితం నుండి రాజ‌కీయాల‌కు బ‌దిలీ ఐన క్ష‌ణం నుంచి అభిమానుల అభిమానం అగ‌మ్య‌గోచ‌రంలో ప‌డిపోయింది. చిరంజీవి రాజ‌కీయాల్లో రాణించి త‌మ జీవితాల్లో నూత‌న వెలుగులు నింపుతార‌ని భావించిన అభిమానుల ఆశ‌లకు అనుకోని విధంగా బ్రేకులు ప‌డ్డాయి. ఆ చేదు అనుభ‌వం నుండి తేరుకున్న కొంత మంది అభిమానుల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపు ఉలిక్కి ప‌డేలా చేస్తోంది. చిరంజీవి అభిమానులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా ఇష్ట‌పుడుతున్న సంద‌ర్బంలో ప‌వ‌న్ పిలుపు వారిని ఎందుకు ఉలిక్కిప‌డేలా చేసింది..? తెలుసుకునే ప్రయ‌త్నం చేద్దాం..!!

తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సంఖ్య అనంతం.!

తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సంఖ్య అనంతం.!

మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంఖ్య అనంతం. మెగాస్టార్ అభిమానులు త‌రువాతి కాలంలో పవన్ కళ్యాణ్ కు కూడా అభిమానులుగా మారిపోయార‌నేది తెలిసందే! కొద్ది రోజుల క్రితం త‌న అభిమానుల‌తో పాటు అన్నయ్య అభిమానులంతా కూడా తనతో కలిసి రావాలంటూ ప‌వ‌న్ వారికి ఆహ్వానం ప‌లికారు. అయితే చిరంజీవి అభిమానులు, పవన్ అభిమానులు జనసేనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారో లేదో ఇప్ప‌ట్లో చెప్ప‌లేమ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఈ విషయంలో మరోసారి మెగా అభిమానులు మోసపోతున్నారేమో అనే సందేహాలు క‌లుగుతున్నాయ‌ని వారు అంటున్న‌ట్టు తెలుస్తోంది!. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలోనే చిరంజీవి అభిమానులు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు.

రాజ‌కీయాల్లో విఫ‌మైన‌ చిరు..! ఆవిరైన అభిమానుల ఆశ‌లు..!!

రాజ‌కీయాల్లో విఫ‌మైన‌ చిరు..! ఆవిరైన అభిమానుల ఆశ‌లు..!!

2009ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు వచ్చాయంటే అది మెగా అభిమానుల పుణ్యమేననే చ‌ర్చ కూడా వినిపిస్తుంటుంది. ఎన్నికల్లో మెగాస్టార్ అభిమానులకు టికెట్లు కేటాయించ‌కున్నా, అభిమానులు చిరంజీవికి అండగా నిలిచార‌ని ఇప్ప‌టికీ చెప్పుకుంటారు. అయితే అప్ప‌టి ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు అభిమానులను తీవ్రంగా నిరాశ‌కు గురిచేశాయి. పార్టీ కోసం స‌ర్వం త్యాగం చేసిన అభిమానులు అగ‌మ్య‌గోచ‌రంలో ప‌డిపోయారు.

స‌ర్వం త్యాగం చేసిన అభిమానుల‌కు మెగా ఫామిలీ అండగా ఉండ‌గ‌లిగిందా..?

స‌ర్వం త్యాగం చేసిన అభిమానుల‌కు మెగా ఫామిలీ అండగా ఉండ‌గ‌లిగిందా..?

పార్టీ ఏర్పాటుకు ముందు అభిమానులతో సమావేశాలు నిర్వహించిన చిరంజీవి అదే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముందు అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అప్పట్లో కొంద‌రు అభిమానులు దీనిపై ఆగ్రహం వ్య‌క్తం చేసిన దాఖ‌లాలున్నాయి. తాము చిరంజీవిని న‌మ్మి మోస‌పోయామ‌ని వాపోయిన‌వారూ ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో కొంత మంది అభిమానులు ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మెగాస్తార్ అభిమానుల‌కు ప‌వ‌న్ పిలుపు...! అయోమ‌యంలో చిరు అభిమానులు.!!

మెగాస్తార్ అభిమానుల‌కు ప‌వ‌న్ పిలుపు...! అయోమ‌యంలో చిరు అభిమానులు.!!

అయితే ప్ర‌జా రాజ్యం విలీనం ఉదంతం జరిగి కొన్నేళ్లు గడిచిపోవడంతో గ‌తాన్ని చాలామంది ఫ్యాన్స్ మర్చిపోయిన‌ట్లు తెలుస్తోంది. కానీ రాజకీయ మేధావులు మాత్రం మరోసారి మెగా ఫ్యామిలీ అభిమానులు మోసపోబోతున్నారేమో అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో పార్టీ పెట్టి అభిమానులను చిరంజీవి మోసం చేశారని, ఇప్పుడు పవన్ కూడా అదే విధంగా చేస్తారేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది . పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో లేదోకానీ, ఆయ‌న‌ను న‌మ్ముకుని, సొంత ప‌నులు వ‌దులుకొని ఆయ‌న చుట్టూ తిరుగుతున్న‌వారు త‌మ భ‌విష్య‌త్ కూడా ఆలోచించుకోవాల‌ని రాజ‌కీయ మేధావులు గుర్తుచేస్తున్నారు.

English summary
Megastar Chiranjeevi and his family are the number of fans in Telugu states are infinity. It is noteworthy that Megastar fans have become fans of Pawan Kalyan in the next! For some fans who got out of that bitter experience Janasana's chief Pawan Kalyan is making a call confusing them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X