వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి అసెంబ్లీకి పెళ్లి సెలవులు, 23,24,25తేదీల్లో విరామం, 27న సమావేశాలు పున:ప్రారంభం

ఏపీ అసెంబ్లీకి 3 రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో వరుసగా పెళ్లిళ్లు ఉన్నాయని, వాటికి ఎమ్మెల్యేలుగా తాము హాజరుకాకుంటే బావుండదని సభ్యుల కోరిక మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Marriage Holidays to AP Assembly, Right or Wrong | Oneinda Telugu

అమరావతి: ఏపీ అసెంబ్లీకి,శాసనమండలికి పెళ్లి సెలవులు ఇచ్చారు. గురు, శుక్ర, శనివారాల్లో పెద్దసంఖ్యలో వివాహాలు ఉన్నందున సమావేశాలకు విరామమివ్వాలని సభ్యులు పదే పదే విజ్ఞప్తి చేయడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. శాసన సభ సమావేశాలు 27 న పున:ప్రారంభమై మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని స్పీకర్ కోడెల ఈ సందర్భంగా తెలిపారు.

సెలవులు అడిగిన ఎమ్మెల్యేలు

సెలవులు అడిగిన ఎమ్మెల్యేలు

శాసనసభ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ముందుగా జీరో అవర్ లో సెలవుల ప్రస్తావన తెచ్చారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో వరుసగా పెళ్లిళ్లు ఉన్నాయని, వాటికి ఎమ్మెల్యేలుగా తాము హాజరుకాకుంటే బావుండదని, కాబట్టి గురు, శుక్ర, శనివారాల్లో సభకు విరామం ఇవ్వాలని విష్ణుకుమార్‌రాజు స్పీకర్‌ను కోరారు. దీనిపై సభలో ఉన్న ఎమ్మెల్యేలంతా చప్పట్లతో, బల్లలు చరుస్తూ తమ మద్దతు తెలిపారు.తర్వాత గద్దె రామ్మోహన్‌, ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని అడిగారు. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సభ మూడ్‌ చూస్తే విరామం ఇవ్వాలన్నట్లుగా ఉందన్నారు.

సెలవులకు స్పీకర్ ఓకే

సెలవులకు స్పీకర్ ఓకే

అనంతరం సభ్యుల సెలవుల వినతికి స్పీకర్ కోడెల సానుకూలంగా స్పందించారు. పోలవరంపై సీఎం సమాధానం పూర్తయిన తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సమావేశాలకు మూడు రోజులు విరామం ప్రకటిస్తూ సభను 27వ తేదీకి వాయిదా వేశారు. 27 నుంచి మరో వారం రోజులు డిసెంబరు ఒకటో తేదీ వరకూ శాసనసభ సమావేశాలు కొనసాగుతాయని ప్రకటించారు.

సెలవులపై ఎమ్మెల్సీ విమర్శల కలకలం

సెలవులపై ఎమ్మెల్సీ విమర్శల కలకలం

పెళ్లిళ్లకు హాజరయ్యేందుకంటూ శాసనసభ,శాసన మండలికి సెలవులు ప్రకటించడంపై శాసన మండలి సభ్యురాలు శమంతకమణి విమర్శలు చేశారు. బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా యనమలను ఉద్దేశించి ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ తమ ఇళ్లల్లో వివాహాలకు ఎవరినీ రానివ్వరని, అదే మీ వాళ్ల ఇళ్లల్లో పెళ్లి జరుగుతుంటే మాత్రం ఏకంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలనే నిలిపేస్తారని ప్రశ్నించారు. ఈనెల 16 న అనంతపురంలో జరిగిన తమ మనవరాలు (శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినిబాల కుమార్తె) పెళ్లికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించినా వారు వచ్చే అవకాశం లేకుండా పోలవరానికి తీసుకుపోయారని అన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ సోదరుడి కుమార్తె పెళ్లి కోసం ఏకంగా రెండు సభలకు మూడు రోజులు సెలవులు ఇచ్చేస్తారా అని ప్రశ్నించారు. ఊహించని విధంగా ఎమ్మెల్సీ శమంతకమణి ప్రశ్నల వర్షం కురిపించడంతో యనమల రామకృష్ణుడు మౌనం వహించారు.

English summary
speaker kodela sivaprasadarao announces 3 days holidays to the Andhra Pradesh Assembly. assembly to reopen on november 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X