వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పుల బాధితులకు నాయిని పరామర్శ: రోదనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్లగొండ జిల్లా జానకీపురంలో కాల్పులకు పాల్పడింది ఉగ్రవాదులు కాదని, వారు ఉత్తరప్రదేశ్‌కు దొంగలేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. కామినేనిలో చికిత్స పొందుతున్న సిఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సిద్ధయ్యను మంత్రి నాయిని శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో నాయిని మాట్లాడారు.

తెలంగాణలో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని నాయిని స్పష్టం చేశారు. సూర్యాపేటలో కాల్పులకు పాల్పడింది.. వీరు ఒక్కరేనని తెలిపారు. దుండగుల నుంచి కార్బన్‌ను, రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

సిద్ధయ్య, బాలగంగిరెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మృతి చెందిన నాగరాజు కుటుంబానికి రూ. 40 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని తెలిపారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ధైర్యసాహసాలతో నల్లగొండ జిల్లా పోలీసులు దుండగులను హతమార్చారని, పోలీసులను నాయిని అభినందించారు.

కాల్పుల బాధితులకు నాయిని పరామర్శ: రోదనలు

దుండగుల కాల్పుల్లో గాయపడిన పోలీసులకు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని కామినేని ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్సై సిద్ధయ్యకు మెదడు భాగంలో, ఛాతిలో బుల్లెట్లు తగిలాయని ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు సిఐలు, ఒక కానిస్టేబుల్ పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ఎస్సై సిద్ధయ్య స్వస్థలం జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లావాసి.

బాధితుల రోదనలు

బాధితుల రోదనలు

నల్లగొండ జిల్లా జానకీపురంలో కాల్పులకు పాల్పడింది ఉగ్రవాదులు కాదని, వారు ఉత్తరప్రదేశ్‌కు దొంగలేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

బాధితుల రోదనలు

బాధితుల రోదనలు

కామినేనిలో చికిత్స పొందుతున్న సిఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సిద్ధయ్యను మంత్రి నాయిని శనివారం పరామర్శించారు.

మంత్రి నాయిని

మంత్రి నాయిని

తెలంగాణలో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని నాయిని స్పష్టం చేశారు. సూర్యాపేటలో కాల్పులకు పాల్పడింది.. వీరు ఒక్కరేనని తెలిపారు.

నాయినితో డిజిపి

నాయినితో డిజిపి

దుండగుల నుంచి కార్బన్‌ను, రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

బాధితులకు పరామర్శ

బాధితులకు పరామర్శ

సిద్ధయ్య, బాలగంగిరెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మృతి చెందిన నాగరాజు కుటుంబానికి రూ. 40 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని తెలిపారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

మీడియాతో..

మీడియాతో..

ధైర్యసాహసాలతో నల్లగొండ జిల్లా పోలీసులు దుండగులను హతమార్చారని, పోలీసులను నాయిని అభినందించారు.

నివాళులు

నివాళులు

దుండగుల కాల్పుల్లో గాయపడిన పోలీసులకు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని కామినేని ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

బాధితుల రోదనలు

బాధితుల రోదనలు

ఎస్సై సిద్ధయ్యకు మెదడు భాగంలో, ఛాతిలో బుల్లెట్లు తగిలాయని ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

మృతుడు నాగరాజు

మృతుడు నాగరాజు

గాయపడిన మరో ఇద్దరు సిఐలు, ఒక కానిస్టేబుల్ పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ఎస్సై సిద్ధయ్య స్వస్థలం జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లావాసి.

English summary
Telangana home minister Nayini Narsimha Reddy said that the perpetrators who died in today's encounter are the same one who attacked police three days back in Suryapeta. He visited the injured policemen in Kamineni hospital. He has also consoled the family of deceased constable Nagaraju who lost his life in the shootout.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X