• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుచరితకు డిమోషన్..కన్నబాబుకు ప్రమోషన్? కేబినెట్‌లో పెను ప్రక్షాళన: హోం మంత్రిగా సీనియర్

|

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. యాక్టివ్‌గా లేని.. ఎఫెక్టివ్‌గా పని చేయలేని ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చని తెలుస్తోంది. వారికి ఉన్న ప్రాధాన్యతను, ఇతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఉద్వాసనకు బదులుగా వేరే శాఖను అప్పగించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఆశించిన దాని కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తోన్న ఒకరిద్దరు మంత్రులకు ప్రమోషన్ కల్పిస్తారనే ప్రచారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా కొనసాగుతోంది.

నాడు శరద్ యాదవ్..నేడు రఘురామ: వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్‌షిప్ అస్త్రం: వేటుకు సిద్ధం

 ఆ ఇద్దరూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో..

ఆ ఇద్దరూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో..

వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫలితంగా- మంత్రివర్గం నుంచి వైదొలగడం అనివార్యంగా మారింది. వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారు. వచ్చేెనెల 6 లేదా ఆపై తేదీల్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయ వచ్చని తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానాలను భర్తీ చేయడంతో మాత్రమే వైఎస్ జగన్ ఆగాలనుకోవట్లేదని, కొందరికి ఉద్వాసన పలుకుతారనీ అంటున్నారు.

సుచరితపై వేటా?.. శాఖ మార్పా?

సుచరితపై వేటా?.. శాఖ మార్పా?

అదే జరిగితే- మొదటి వేటు హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరితపై పడొచ్చని సమాచారం. విభజన అనంతరం 13 జిల్లాలతో ఏర్పాటైన రాష్ట్రానికి అత్యంత కీలకమైన హోం శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించే అవకాశం లభించింది సుచరితకు. దానికి అనుగుణంగా.. వైఎస్ జగన్ అంచనాలను అందుకోలేని విధంగా సుచరిత పనితీరు ఉందని చెబుతున్నారు. పైగా- రాజకీయాలతో ముడిపడి ఉన్న కొన్ని కీలక విషయాలపై సుచరిత.. అగ్రెసివ్‌గా వ్యవహరించలేదనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెకు ఉద్వాసన పలకొచ్చని అంటున్నారు. ఆమెకు మరో శాఖను అప్పగించే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం.

 పినిపే విశ్వరూప్‌కు హోం శాఖ

పినిపే విశ్వరూప్‌కు హోం శాఖ

మరో సీనియర్ నాయకుడు పినిపే విశ్వరూప్‌కు హోం మంత్రిత్వ శాఖను అప్పగిస్తారనే సమాచారం ప్రచారంలో ఉంది. మేకతోటి సుచరిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు విశ్వరూప్. ఆమె ఖాళీ చేసిన శాఖను అదే సామాజిక వర్గానికి చెందిన విశ్వరూప్‌తో భర్తీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం విశ్వరూప్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. వైఎస్ కుటుంబానికి విశ్వాసపాత్రునిగా, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా పినిపే విశ్వరూప్‌‌కు పేరుంది. పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావడం వల్ల హోం శాఖను పినిపేకు అప్పగిస్తారని చెబుతున్నారు.

 కన్నబాబుకు ఉపముఖ్యమంత్రిగా

కన్నబాబుకు ఉపముఖ్యమంత్రిగా

కాగా.. కురసాల కన్నబాబుకు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైఎస్ జగన్ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్ అంచనాలకు మించి ఆయన రాణిస్తున్నారని చెబుతున్నారు. వ్యవసాయ, వ్యవసాయయ అనుబంధ శాఖలను కన్నబాబు పరుగులెత్తిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు సహా అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారనే భావన వైఎస్ జగన్‌లో ఉందని, అందుకే.. ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కల్పించడంతో పాటు మోపిదేవి వెంకటరమణకు చెందిన శాఖలను కన్నబాబుకు అప్పగిస్తారని అంటున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ చేసిన స్థానాన్ని కన్నబాబుతో భర్తీ చేయొచ్చని చెబుతున్నారు.

  తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu
   ఎవరి సామాజిక వర్గం ఖాళీలను..

  ఎవరి సామాజిక వర్గం ఖాళీలను..

  మంత్రివర్గంలో ఏర్పడుతాయని భావిస్తోన్న ఎవరి సామాజిక వర్గం ఖాళీలను అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులతో భర్తీ చేయడం ద్వారా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో జిల్లాల సమతౌల్యాన్ని కూడా పాటించాలని యోచిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకుడు. ఆయన ఖాళీ చేసే స్థానాన్ని అదే జిల్లాకు చెందిన కన్నబాబుతో భర్తీ చేస్తారని అంటున్నారు. సుచరిత విషయంలో మాత్రం కులాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారని చెబుతున్నారు.

  English summary
  Home Minister of Andhra Pradesh Sucharita to get demoted and Agriculture Minister Kurasala Kannababu to be promoted as Deputy Chief Minister in Andhra Pradesh Cabinet. Chief Minister YS Jagan Mohann Reddy is likely to reshuffle the Cabinet after Pilli Subhash Chandrabose and Mopidevi Venkata Ramana elected to Rajya Sabha.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X