వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ... నన్ను వేధించేందుకే!: ట్యాపింగ్‌లో హైకోర్టుకు తెలంగాణ రాజీవ్ త్రివేది

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన దస్త్రాల సమర్పణ కోసం విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు (సిఎంఎం) తనకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది హైకోర్టును శనివారం ఆశ్రయించారు.

ఆగస్టు 17న ఇచ్చిన ఆ ఉత్తర్వుల పైన తదుపరి చర్యలు అన్నింటిని నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, దానిని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

మరోవైపు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టుకు చేరిన నేపథ్యంలో ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా సిఎంఎం న్యాయస్థానాన్ని ఆదేశించాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపు చేసేలా ఈ అంశంపై దర్యాఫ్తు చేస్తున్న ఏపీ సిట్‌ను ఆదేశించాలని కోరారు.

Home secretary Rajiv Trivedi challenges notice in Phone Tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్ డేటా వివరాలను సిఎంఎం కోర్టుకు సీల్డు కవర్లో అందజేయాలని, వాటిని అందుకున్న కోర్టు వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్‌కు పంపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సర్వీస్ ప్రొవైడర్లు సీల్డు కవర్లో సిఎంఎం కోర్టుకు దస్త్రాలను సమర్పించారని తెలిపారు.

అలాంటప్పుడు అదే కేసులో మళ్లీ తనకు నోటీసులు జారీ చేయడం న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమే అన్నారు. తనను వేధింపులకు గురి చేయడం కోసం నోటీసు జారీ చేసినట్లుందన్నారు. సోమవారం ఇది విచారణకు రానుంది.

English summary
Telangana principal secretary, home, Rajiv Trivedi, has moved the High Court challenging the notice issued by the Chief Metropolitan Magistrate Court, Vijayawada, in the alleged phone tapping case registered at Bhavanipuram police station of Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X