విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్తీ మద్యం: కటక్, హైదరాబాదుల్లో మల్లాది విష్ణు కోసం గాలింపు, హాజరు కాని తల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణు మెడకు కల్తీ మద్యం ఉచ్చు బిగిసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన అరెస్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగం సిద్ధం చేసింది. ఆయనను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

మల్లాది విష్ణు కోసం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో, ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Hooch tragedy: SIT searches for Malladi Vishnu

విజయవాడలోని స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించగా, 31 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మల్లాది విష్ణును శనివారం సాయంత్రానికి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన శనివారంనాడు ఒడిశాలోని కటక్‌లో ఓ ఆలయాన్ని సందర్శించుకున్నట్లు చెబుతున్నారు.

మల్లాది విష్ణు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాప్ చేసేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా మల్లాది విష్ణు తల్లి బాలత్రిపుర సుందరమ్మ కోసం సిట్ అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూశారు. ఆమె పోలీసు స్టేషన్‌కు రాకపోవడంతో సిట్ అధికారులు వెనుదిరిగారు.

English summary
SIR probing on hooch tragedy case Swarna bar in Vijayawada formed four special teams to nab Congress leader Malladi Vishnu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X