విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపిపై మరోలా పవన్ రియాక్షన్, చంద్రబాబు పైచేయి!: అందుకే 'పంచెకట్టు'తో

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రంలోని బిజెపి హామీ ఇచ్చిందని, హామీలను 'నెరవేర్చను' అని చెబితే తన స్పందన మరోలా ఉంటుందని కమలం పార్టీని హెచ్చరించారు.

అయితే, ఆ పార్టీ హామీలు నెరవేర్చుతానని చెబుతోందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిజెపి ఏపీకిచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అయితే, వేచి చూస్తామని మెలిక పెట్టారు.

ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక హోదా లేదా మరేదైనా... పేరు ఏదైనా ఏపీకి సాయం ముఖ్యమని చెప్పారు. బీహార్ ఎన్నికల ఫలితాల పైన స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే, హామీలు నెరవేర్చకుంటే బిజెపికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

Pawan Kalyan - Chandrababu Naidu

అదే సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఒకింత మెచ్చుకున్నారు. తాను పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోమని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

బిజెపిపై టిడిపి పైచేయి!

బీహార్ ఎన్నికల్లో బిజెపి పరాజయం అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు కమలం పార్టీ పైన, ప్రధాని మోడీ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు టిడిపి పైన బిజెపిది పైచేయిగా కనిపించింది. కానీ, బీహార్ ఎన్నికల్లో ఓటమి ఒత్తిడి నేపథ్యంలో టిడిపి మిత్రపక్షం బిజెపిపై విరుచుకుపడింది.

తాజాగా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబును కలవడం, బిజెపికి హోదా విషయంలో హెచ్చరిక, చంద్రబాబు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని చెప్పడం.. తదితరాల నేపథ్యంలో బిజెపి ప్రస్తుతానికి మరింత ఇరుకున పడిందని చెబుతున్నారు.

జనసేన పార్టీ బలోపేతంపై స్పందిస్తూ.. జనసేన పార్టీని విస్తరించాలని ఉన్నా అందుకు తగిన ఆర్థిక స్తోమత లేదన్నారు. తన సన్నిహితులతో మాట్లాడి పార్టీని విస్తరించడానికి గల అవకాశాలపై చర్చిస్తానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని కచ్చితంగా విస్తరించి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ఇదిలా ఉండగా, పంచెకట్టుతో రావడంపై కొందరు విలేకరులు పవన్ కళ్యాణ్‌ను ఆ తర్వాత ప్రశ్నించారు. ఏదైనా ప్రత్యేకత ఉందా అని ప్రశ్నించారు. అయితే, పూజ చేసుకొని అలాగే వచ్చేశానని, అంతే తప్ప పంచెకట్టుతో రావడంలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు.

English summary
Janasena chief Pawan Kalyan, who supported the TDP-BJP combine in the elections last year, on Thursday said he was hopeful that Prime Minister Narendra Modi would fulfil promises made to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X