అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఇంటిపై స‌భ‌లో రభ‌స‌: ఫైర్ అయిన ముఖ్య‌మంత్రి: వైయ‌స్సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్ : బాబు..!

|
Google Oneindia TeluguNews

కృష్ణా క‌ర‌క‌ట్ట కింద నిర్మాణాలు అందులో చంద్ర‌బాబు ఉంటున్న నివాసం గురించి శాస‌న‌స‌భ‌లో ర‌భ‌స చోటు చేసుకుం ది. క‌ర‌క‌ట్ల మీద అక్ర‌మంగా ఉన్న నిర్మాణాల‌కు ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చామ‌ని..చ‌ట్టం చేసే వారే అతిక్ర‌మిస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ మంత్రి బొత్సా ప్ర‌శ్నించారు. నాటి ముఖ్య‌మంత్రి ప్ర‌జావేదిక నిర్మాణానికి న‌దీ ప‌రిరక్ష‌ణ చ‌ట్టం కింద కింద అనుమ‌తి తిరస్క‌రించినా..నిర్మించార‌ని దీని కార‌ణంగానే కూల్చివేయాల్సి వ‌చ్చింద‌న్నారు. సుప్రీం కోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు తాను ఉంటున్న నివాసం నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఉంద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. కోర్టు ఉత్త‌ర్వు ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారంటూ ముఖ్య‌మంత్రి ఫైర్ అయ్యారు.

 ముఖ్య‌మంత్రి ద‌ర్పంతో ఉల్లంఘించారు..

ముఖ్య‌మంత్రి ద‌ర్పంతో ఉల్లంఘించారు..

శాస‌న‌స‌భ‌లో క‌ర‌క‌ట్ట కింద ఉన్న అక్ర‌మ నిర్మాణాల గురించి ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో చ‌ర్చ సాగింది. మంత్రి బొత్సా ఖ‌చ్చితంగా నిబంధ‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్న వాటి పైన చ‌ర్య తీసుకుంటామ‌ని స్పష్టం చేసారు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ న‌దీ ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టం ఏం చెబుతోంది..అదే విధంగా ప్ర‌జా వేదిక నిర్మాణానికి అనుమ‌తి అధికారు లు నిరాక‌రించినా ఏ ర‌కంగా నిర్మించిందీ వివరించారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించా లని రివర్‌ కన్జర్వేటివ్‌ ఇంజనీర్‌ రాసిన లేఖను స‌భ‌లో ప్ర‌ద‌ర్శించారు. సామాన్యుడు అక్రమ నిర్మాణం చేపడితే వెంటనే కూల్చేస్తారని.. ముఖ్యమంత్రయినా సామాన్యుడైనా ఒకటే నిబంధన ఉండాలన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉందంటూ ఊదరగొడతారని... నిబంధనలు అతిక్రమించేందుకేనా అనుభవం అని ప్ర‌శ్నించారు. రాజకీ య చరిత్ర ఉంటే నలుగురికీ ఆదర్శంగా ఉండాలి కానీ.. సీఎం హదాలో ఉన్న వ్యక్తి అక్రమాలకు పాల్పడితే మిగతా జనం అదే అనుస‌రించ‌రా అని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు.

తాము ఉల్లంఘించ‌లేదంటూ చంద్ర‌బాబు వివ‌ర‌ణ‌..

తాము ఉల్లంఘించ‌లేదంటూ చంద్ర‌బాబు వివ‌ర‌ణ‌..

దీనికి స్పంద‌న‌గా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తాను ఉంటున్న నివాసం నిబంధ‌న‌ల మేర‌కే ఉంద‌న్నారు. తాను కేవ‌లం అద్దెకు మాత్ర‌మే ఉంటున్నాని చెప్పుకొచ్చారు. సుప్రీం తీర్పును ప్ర‌స్తావించారు. క‌ర‌క‌ట్ట వ‌ద్ద మంతెన స‌త్య‌నారాయ‌ణ రాజు భ‌వ‌నం నిర్మాణానికి వైయ‌స్ అనుమ‌తి ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకొని 74 వేల‌పేద‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. పేద‌ల జోలికి వెళ్ల‌వ‌ద్ద‌ని సూచించారు. తాను ఎప్పుడూ చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌లేద‌ని..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో రాష్ట్రంలో అనుమ‌తి లేకుండా అనేక చోట్ల వైయ‌స్సార్ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసార‌ని చెప్పుకొచ్చారు. త‌న గంతు నొక్క‌లేర‌ని..త‌న నోరు మూయించ‌లేరంటూ చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. దీని పైన స్పీక‌ర్ సైతం తీవ్రంగా ప్ర‌తిస్పందించారు. ఇక్క‌డ ఉన్న అంద‌రికీ అవకాశం ఇవ్వ‌లేన‌ప్పుడు తాను ఇక్క‌డ స్పీక‌ర్‌గా ఉండ‌టం దేనిక‌ని ప్ర‌శ్నించారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫైర్‌..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫైర్‌..

చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పైన సీనియ‌ర్ నేత‌లు ఆనం..అంబ‌టి రియాక్ట్ అయ్యారు. ఒక్క వైయ‌స్సార్ విగ్ర‌హం మాత్ర‌మే కాద‌ని ఎన్టీఆర్‌..గాంధీ విగ్ర‌హాలు సైతం ఉన్నాయ‌ని గుర్తు చేసారు. చంద్ర‌బాబు నిబంధ‌న‌లు..చ‌ట్టాల గురిం చి మాట్లాడుతారా అంటూ..వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. వైయ‌స్సార్ విగ్ర‌హాన్ని చూస్తే చంద్ర‌బాబుకు క‌డుపు మంట అని వ్యాఖ్యానించారు. దీనికి స్పంద‌న‌గా చంద్ర‌బాబు త‌న‌కు వైయ‌స్సార్ బెస్ట్ ఫ్రెండ్ అని తామిద్దరం 1978 నుండి 1983 వ‌ర‌కు క‌లిసి ఒకే గ‌దిలో ఉన్నామ‌ని చెప్పుకొచ్చారు. త‌రువాతి రోజుల్లో రాజ‌కీయంగా మాత్ర‌మే విభేదించాన‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందిస్తూ చంద్ర‌బాబు సుప్రీం తీర్పును త‌న‌కు అనుకూలం గా వ‌క్రీక‌రించి చెబుతున్నార‌ని..ప్ర‌జావేదిక కూల్చివేత స‌మ‌యంలో అర్ద‌రాత్రి హౌస్ మోష‌న్‌కు వెళ్లినా..హై కోర్టు స్టే ఇవ్వ‌లేద‌ని గుర్తు చేసారు. చంద్ర‌బాబు సీనియ‌ర్ అయి ఉండి అర్దం లేకుండా మాట్లాడుతున్నార‌ని ఫైర్ అయ్యారు.

English summary
Hot discussion in AP Assembly on Chandra babu living residence on Krishna Branch. CM jagan serious on Chandra Babu on violating river conservation act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X